Ashes 2021: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆసీస్ బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కడుతోన్న ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్..!

|

Dec 08, 2021 | 7:17 AM

Australia vs England: యాషెస్ సిరీస్ 2021-22 పోరు మొదలైంది. బ్రిస్బెన్‌లో జరుగుతోన్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా మారలేదు.

Ashes 2021: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆసీస్ బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కడుతోన్న ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్..!
Ashes 2021 Aus Vs Eng
Follow us on

Ashes 2021: యాషెస్ సిరీస్ 2021-22 పోరు మొదలైంది. బ్రిస్బెన్‌లో జరుగుతోన్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా మారలేదు. బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ రోరీ బర్స్న్(0) ఆసీస్ పేస్ బౌలర్ స్టార్క్ పెవిలియన్ చేర్చాడు. దీంతో షాక్‌లోకి వెళ్లిన ఇంగ్లండ్ టీం.. ఆ తరువాత రెండు వికెట్లను కూడా త్వరగానే కోల్పోయింది. డేవిడ్ మలాన్(6), జో రూట్(0) వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. హజల్‌వుడ్ బౌలింగ్‌లో వీరిద్దరూ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. దీంతో క్రీజులో ఉన్న హసీబ్ హమీద్, బెన్ స్టోక్స్ చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు.

అయితే 12.4 ఓవర్లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్(5) పెవిలియన్ చేరాడు. దీంతో మరోసారి ఇంగ్లండ్ టీం పీకల్లోతూ కష్టాల్లో కూరకపోయింది. ఈ వికెట్‌తో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన తొలి యాషెస్ వికెట్‌ను దక్కించుకున్నాడు. కడపటి వార్తలు అందేసరికి ఇంగ్లండ్ టీం 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.

Also Read: IND vs NZ: మ్యాచ్‌ ఆడకుండా ఒక్క క్యాచ్‌తో హీరో అయ్యాడు.. అద్భుతమైన ఫిల్డింగ్ చేసిన ఆ ఆటగాడు ఎవరంటే..

27 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 7గురి బౌలర్ల భరతం పట్టాడు.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా!