
IPL 2025 Suspended: భారతదేశంలో జరుగుతోన్న ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తత కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఐపీఎల్ మిగిలిన్ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా, ఇప్పటికే ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది సీజన్‌లో 58వ మ్యాచ్. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. అంటే ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రాబోయే మ్యాచ్‌లపై సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. హల్గామ్‌లో పర్యాటకులపై దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ రద్దు తర్వాత, ఐపీఎల్ 2025ను నిరవధికంగా వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు ఇప్పుడు వాయిదా పడితే, అవి ఎప్పుడు జరుగుతాయనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. దీనికోసం BCCI కొత్త విండో కోసం కష్టపడాల్సి ఉంటుంది. 16 మ్యాచ్‌లు నిర్వహించడానికి కనీసం రెండు వారాలు పడుతుంది. ఐపీఎల్ తర్వాత భారత్ ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఆగస్టు నాటికి ఇరుజట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది. ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో భారత్ పరిస్థితి కూడా బాగోలేదు. ఈ కారణంగా, ఈ సిరీస్‌పై కూడా నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి.
IPL suspended indefinitely due to India-Pakistan military conflict: BCCI official
— Press Trust of India (@PTI_News) May 9, 2025
జూన్ 20 నుంచి ఆగస్టు 04 వరకు – ఇంగ్లాండ్‌తో 5 టెస్ట్ మ్యాచ్‌లు
ఆగస్టు 17 నుంచి ఆగస్టు 31 వరకు – బంగ్లాదేశ్‌తో 3 వన్డేలు మరియు 3 టీ20లు
సెప్టెంబర్- ఆసియా కప్ 2025 (ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియా కప్ జరగడం కూడా అనుమానమే?)
అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు – వెస్టిండీస్‌తో రెండు టెస్టులు
అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు – ఆస్ట్రేలియాతో 3 వన్డేలు మరియు 5 టీ20లు
నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు – దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు
ఐపీఎల్ కారణంగా, ఇతర దేశాలు కూడా ఈ కాలంలో తమ సిరీస్‌లను నిర్వహించవు. ఆగస్టులో, న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో పాటు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు కూడా బిజీగా ఉంటాయి. సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ సమయంలో భారత జట్టు ఆసియా కప్ ఆడాల్సి ఉంది. పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య ఈ టోర్నమెంట్ కూడా రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆసియా కప్ రద్దయితే, ఈ విండోలో ఐపీఎల్ 2025లో మిగిలిన 16 మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్ ఉంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. దీనితో పాటు, ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, ఒక విండోను కనుగొనడం BCCIకి కష్టమైన సవాలుగా ఉంటుంది.
If the IPL suspension becomes official soon, the window of India tour of Bangladesh and Asia Cup could be used to complete the tournament. @toisports
— Sahil Malhotra (@Sahil_Malhotra1) May 9, 2025
ఐపీఎల్ 2025 వాయిదా వేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం బీసీసీఐ వేచి చూస్తోందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ప్రభుత్వం నుంచి సలహా పొందిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నోలోని ఎకానా స్టేడియంలో తలపడనున్నాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..