RCB vs PBKS: మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడానికి అక్కడుంది పిల్ల బచ్చా అనుకుంటివా..? కింగ్‌ కోహ్లీ మచ్చా..

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గత మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో సేమ్ బాల్ కు అద్భుతమైన పుల్ షాట్‌తో బౌండరీ కొట్టాడు.

RCB vs PBKS: మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడానికి అక్కడుంది పిల్ల బచ్చా అనుకుంటివా..? కింగ్‌ కోహ్లీ మచ్చా..
Virat Kohli Arshdeep Singh

Updated on: Apr 20, 2025 | 6:02 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌ కంటే ముందు ఈ రెండు టీమ్స్‌ రెండు రోజుల క్రితం ఏప్రిల్‌ 18న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలబడ్డాయి. అప్పుడు ఆర్సీబీని పంజాబ్‌ ఓడించింది. ఆ ఓటమికి ప్రతీకారమే లక్ష్యంగా బరిలోకి దిగినట్లు ఆడుతోంది ఆర్సీబీ. అయితే.. తొలి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీని అర్షదీప్‌ సింగ్‌ ఓ సూపర్‌ షార్ట్‌ పిచ్‌ బాల్‌తో అవుట్‌ చేశాడు. దాంతో ఆర్సీబీపై పంజాబ్‌ విజయం తేలికైంది. మళ్లీ ఈ రోజు కూడా సేమ్‌ అదే బాల్‌ను విరాట్‌ కోహ్లీపై ప్రయోగించాడు అర్షదీప్‌ సింగ్‌. కానీ, ఈ సారి ఫలితం వేరేలా వచ్చింది.

గత మ్యాచ్‌లో సేమ్‌ బాల్‌ను గాల్లోకి కొట్టి వికెట్‌ సమర్పించుకున్న కోహ్లీ, ఈ సారి మాత్రం అదే బాల్‌ అద్భుతమైన కంట్రోల్‌తో సూపర్‌గా పుల్‌ షాట్‌ ఆడి బౌండరీ కొట్టాడు. అయినా ఒకే బాల్‌కు పదే పదే అదే తప్పు చేయడానికి అక్కడుండి పిల్లబచ్చా ప్లేయర్‌ కాదు.. విరాట్‌ కోహ్లీ అంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. కాగా విరాట్‌ కోహ్లీ అవుట్‌ సైడ్‌ది ఆఫ్‌ స్టంప్‌ వీక్‌నెస్‌ ఉంది కానీ, షార్ట్‌ బాల్‌, బౌన్సర్‌ వీక్‌నెస్‌ లేదు. గత మ్యాచ్‌లో అంటే వర్షం పడి, బాల్‌ కాస్త ఆగి రావడం, అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువ బౌన్స్‌ కావడంతో కోహ్లీ అగ్రెసివ్‌గా ఆడేందుకు ముందు కొచ్చి కొట్టడంతో బాల్‌ గాల్లోకి లేచింది. కానీ, అక్కడు నిలబడి ఆడి ఉంటే.. ప్రాపర్‌గా టైమ్‌ చేసేవాడు. ఈ మ్యాచ్‌లో సరిగ్గా అదే చేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.