Virat Kohli – Anushka Sharma: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) చివరి మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లండన్ చేరుకున్నాడు. WTC చివరి మ్యాచ్ జూన్ 7 నుంచి ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరగనుంది. దీని కోసం టీమ్ ఇండియా మొదటి బ్యాచ్ ఇంగ్లండ్‌కు చేరుకుంది. ఇంతలో, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త విరాట్‌ను స్లెడ్జింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జోడి మధ్య బంధం అభిమానులకు చాలా ఇష్టం. ఇటీవల ఈ జంట ఒక ఈవెంట్‌లో భాగమైంది. ఇందులో విరాట్, అనుష్క తమ ఫన్నీ స్టైల్‌తో అభిమానులను ఎంతగానో అలరించారు.
ఈ కార్యక్రమంలో యాంకర్ అనుష్కకు కోహ్లీని స్లెడ్జింగ్ చేసే పనిని అప్పగించారు. ఆమె ఒక అనుభవజ్ఞుడైన క్రికెటర్‌లా ప్రవర్తించింది. వీడియో ప్రారంభంలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. అనుష్క వెనుక నుంచి స్లెడ్జ్ చేస్తూ చలో-ఛలో విరాట్, ఈ రోజు ఏప్రిల్ 24, ఈరోజు పరుగులు చేసే సమయం అంటూ స్లెడ్జింగ్ చేస్తోంది. ఇలా చెప్పి విరాట్‌ని వెనుక నుంచి కౌగిలించుకుంది. అప్పుడు కోహ్లి నన్ను రీ ఎంట్రీ చేయనివ్వండి అంటూ సమాధానమిస్తాడు. ఆ తర్వాత అనుష్క శర్మ ‘అబే, జూన్-జూలైలో మీ జట్టు ఎన్ని మ్యాచ్‌లు ఆడినా పరుగులు చేయలేదు’ అంటూ టీజ్ చేసింది.
Fun moments between Virat Kohli and Anushka Sharma.
Anushka imitating Virat’s celebration was the best! pic.twitter.com/e3ono4oXlG
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2023
విరాట్ కోహ్లీ వేడుకను అనుష్క శర్మ కాపీ కొట్టింది. మ్యాచ్‌తో సంబంధం లేకుండా జట్టుకు వికెట్ లభించినప్పుడల్లా, విరాట్ కోహ్లీ ఉత్సాహం పీక్స్‌లో ఉంటుంది. ఇదే శైలినీ అనుష్క శర్మ తనదైన రీతిలో సెలబ్రేట్ చేసింది. ఈ కార్యక్రమంలో, అనుష్క విరాట్‌ను అనుకరించడానికి ఒక టాస్క్ కూడా ఇచ్చారు. ఇది బాలీవుడ్ నటి బాగా చేసింది. నెటిజన్లు ఈ జోడి వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..