Andre Russell: ఆండ్రీ రస్సెల్.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు ముచ్చెమటలు పట్టించే ఈ కరేబియన్ క్రికెటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్రీజులోకి వచ్చింది మొదలు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటాడీ విండీస్ ఆల్‌రౌండర్. తాజాగా తన బ్యాటింగ్ పవర్ పదునేంటో మరోసారి చూపించాడు.
Andre Russell: ఆండ్రీ రస్సెల్.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు ముచ్చెమటలు పట్టించే ఈ కరేబియన్ క్రికెటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్రీజులోకి వచ్చింది మొదలు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటాడీ విండీస్ ఆల్‌రౌండర్. తాజాగా తన బ్యాటింగ్ పవర్ పదునేంటో మరోసారి చూపించాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న ది హండ్రెడ్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ టోర్నీలో మాంచెస్టర్ తరఫున బరిలోకి దిగిన ఆండ్రీ తాజాగా సదరన్ బ్రేవ్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో రస్సెల్ 23 బంతుల్లో మొత్తం 64 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 278.26. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. రస్సెల్ తాను ఎదుర్కొన్న చివరి 5 బంతుల్లో ఏకంగా 24 రన్స్ రాబట్టడం విశేషం. ఇందులో 2 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్ చలవతో నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ 42 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడంలో సదరన్ బ్రేవ్స్ పూర్తిగా చతికిలపడింది. 84 బంతుల్లో 120 పరుగులకే కుప్పకూలింది. దీంతో మాంచెస్టర్‌కు 68 పరుగుల భారీ విజయం సొంతమైంది. సదరన్ బ్రేవ్ జట్టులో జార్జ్ గార్టన్ జట్టు అత్యధికంగా 25 పరుగులు చేశాడు. కెప్టెన్ జేమ్స్ విన్స్ 20 పరుగులు చేశాడు. పాల్ వాల్టర్ మూడు వికెట్లు తీశాడు.
6️⃣4️⃣6️⃣4️⃣4️⃣
No margin for error with @Russell12A at the striker’s end, and #MichaelHogan made plenty. Is there any better finisher in the game?