
ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఆట చూసేందుకు కొన్ని లక్షల మంది స్టేడియానికి వస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2025లో కూడా ధోని కోసమే స్టేడియానికి వస్తున్న వాళ్లు, టీవీల ముందు కూర్చుంటున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. శుక్రవారం ఆర్సీబీతో సీఎస్‌కే చెపాక్ వేదికగా మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు సీఎస్‌కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని కారణంగా సీఎస్‌కే ఆటగాళ్లు చాలా ఇబ్బందికి గురి అవుతూ ఉంటారని, ఇది చాలా కాలంగా జరుగుతుందని, ఎవరూ దీని గురించి బహిరంగంగా చెప్పరని, కానీ, లోపల మాత్రం కుమిలిపోతుంటారంటూ రాయుడు పేర్కొన్నాడు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వైరల్‌గా మారాయి. ధోని అంటే సీఎస్‌కే, సీఎస్‌కే అంటే ధోని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనిని చూసే 90 శాతం మంది సీఎస్‌కే టీమ్‌కు సపోర్ట్ చేస్తారు. అతి ఆ ప్రేమ కొన్ని సందర్భాల్లో లైన్ దాటుతుందనే ఉద్దేశంతో రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలె ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు ఓ రెండు బంతులు ఎదుర్కొని, రన్స్ ఏమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని, చివర్లో ఒక సిక్స్‌తో రచిన్ రవీంద్రా మ్యాచ్‌ను ముగించాడు. ఇది ధోని అభిమానులకు కోసం తెప్పించింది. చివర్లో ధోనికి స్ట్రైక్ ఇవ్వకుండా మ్యాచ్ ఎందుకు ముగించావ్ అంటూ రచిన్ రవీంద్రాను సీఎస్‌కే అభిమానులు తిట్టడం స్టార్ట్ చేశారు.
ఇలాంటి వింత అనుభవాలు గతంలో చాలా మంది సీఎస్‌కే ఆటగాళ్లకు ఎదురైనట్లు రాయుడు పేర్కొన్నాడు. ధోని బ్యాటింగ్ చూసేందుకు అప్పటి వరకు ఆడుతున్న ఆటగాళ్లు అవుట్ అవ్వాలని కూడా సీఎస్‌కే అభిమానులు కోరుకుంటారు, అందుకోసం స్టేడియంలో గట్టిగా అరుస్తారు కూడా అంటే వెల్లడించాడు. ఇది చాలా ఇబ్బంది కరంగా ఉంటుందని అన్నాడు. అయితే.. ధోనిని వాళ్లు ఇంతలా ప్రేమించడంలో తప్పేమి లేదని, సీఎస్‌కే టీమ్‌ను నిర్మించడంలో ధోని ఎంతో కష్టపడ్డాడని, ఇన్నేళ్ల నుంచి సీఎస్‌కేను ఒక సక్సెస్‌ఫుల్ టీమ్‌గా తీర్చిదిద్దాడంటూ రాయుడు వెల్లడించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..