క్రికెట్ ఫ్యాన్స్‌కు మరోసారి ప్రపంచకప్ వినోదం అందనుంది. ఐసీసీ రెండేళ్లకోసారి నిర్వహిస్తోన్న మహిళల టీ20 ప్రపంచకప్ ఇవాల్టి (ఫిబ్రవరి 10) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకతో తలపడనుంది. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ లో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఇక గత ప్రపంచకప్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమిండియా ఈసారైనా కప్ గెలవాలని ధీమాతో ఉంది. వీటితో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పటిష్ఠంగా ఉన్నాయి. కాగా ఈ టోర్నీలో హై వోల్టేజ్ మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 12) జరగనుంది. గ్రూప్-బీలో భాగంగా భారత్ – పాక్ మధ్య మ్యాచ్ తో ఈ టోర్నీలో భారత్ ప్రపంచకప్ వేట మొదలవుతుంది. టీమిండియా బలాబలాల విషయానికి వస్తే.. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా లతో పాటు ఆల్ రౌండర్లు స్నేహ్ రాణా, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ మంచి ఫామ్ లో ఉన్నారు.
ఇక బౌలింగ్ లో రాజేశ్వరి గైక్వాడ్ తో పాటు యువ సంచలనం రేణుకా ఠాకూర్ నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల షెఫాలీ వర్మ సారథ్యంలోని అండర్ – 19 భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెల్చుకోవడం హర్మన్ సేనకు బూస్ట్ ఇచ్చే విషయమే. ఆ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించిన షెఫాలీ.. సీనియర్ లెవెల్‌లో కూడా సత్తా చాటడానికి రెడీ అవుతోంది. 2009 నుంచి ఐసీసీ ప్రతి రెండేళ్లకోసారి మహిళల టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటివరకు 8 ఎడిషన్లు పూర్తికాగా నేటి నుంచి 9వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఇప్పటికే ఒక హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న ఆసీస్ రెండో హ్యాట్రిక్‌ను పూర్తి చేయాలని భావిస్తోంది. అదే సమయంలో 2020 ప్రపంచకప్ ఫైనల్‌లో బోల్తా కొట్టిన టీమిండియా ఈ సారి ఎలాగైనా ప్రపంచకప్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.
Following the success of the U19 team, will India register a rare double at the ICC Women’s #T20WorldCup in South Africa? ?https://t.co/tS2k73VGAG
— T20 World Cup (@T20WorldCup) February 8, 2023
టీమిండియా మ్యాచ్ లన్నీ భారత కాలమానం సాయంత్రం 6.30 గంటలకు మొదలవుతాయి.
India are all set and ready for the #T20WorldCup ???? pic.twitter.com/UHxqnp67kc
— T20 World Cup (@T20WorldCup) February 6, 2023
భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుకా సింగ్ ఠాకూర్, అంజలి సర్వని, పూజా వస్త్రాకార్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే
రిజర్వ్ ప్లేయర్లు
సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్
మ్యాచ్‌లు ఎక్కడ చూడొచ్చంటే..
మహిళల టీ20 ప్రపంచకప్ ను స్టార్ స్పోర్ట్స్ తో పాటు డిస్నీ హాట్ స్టార్ లలో లైవ్ చూడొచ్చు.
Plenty to keep an eye out for at the #T20WorldCup ?https://t.co/JFiRzL67Xh
— T20 World Cup (@T20WorldCup) February 8, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..