
ముంబై జట్టు 2025-26 రంజీ ట్రోఫీలో ఛత్తీస్‌గఢ్‌తో రెండో రౌండ్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 406 పరుగులు చేసింది. జట్టు తరపున సీనియర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానె తన 42వ ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు. అజింక్య రహానే ఇన్నింగ్స్ ముంబైని ఇబ్బందుల నుండి కాపాడింది. అతను బ్యాటింగ్ కు దిగే సమయానికి ముంబై 3 వికెట్లకు 38 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రహానే జట్టు ఇన్నింగ్స్ ను నడిపించాడు, 303 బంతుల్లో 21 ఫోర్లతో సహా 159 పరుగులు చేశాడు. ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో మాట్లాడిన రహానే, టీమ్ ఇండియాకు తిరిగి రావడం గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు.
‘ఎంపికకు వయస్సు అడ్డంకి కాకూడదు. ఇది వయస్సు గురించి కాదు, ఉద్దేశ్యం గురించి. ఇది ఎర్ర బంతితో అభిరుచి, కృషి గురించి. ఏజ్ ఎక్కువ ఉందని నిర్లక్ష్యం చేయడంతో నేను ఏకీభవించను. ఎందుకంటే మైఖేల్ హస్సీ 30 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసి చాలా పరుగులు చేశాడు. రెడ్-బాల్ క్రికెట్‌లో అనుభవం ముఖ్యం. ఆస్ట్రేలియాలో భారత జట్టుకు నా అవసరం ఉందని నేను భావిస్తున్నాను. 34-35 తర్వాత ఆటగాళ్లు వృద్ధులని ప్రజలు భావిస్తారు. కానీ రెడ్-బాల్ క్రికెట్‌పై ఆసక్తి ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. “సెలెక్టర్లు గణాంకాలపైనే కాకుండా ఉద్దేశ్యం, అభిరుచిపై దృష్టి పెట్టాలి. ఇది ఎల్లప్పుడూ ప్రదర్శన గురించి కాదు, కానీ ఒక ఆటగాడు ఎర్ర బంతితో ఆడటానికి ఎంత అంకితభావంతో ఉన్నాడనేది ముఖ్యం” అని రహానె అన్నాడు.
అజింక్య రహానే చివరిసారిగా టీం ఇండియా తరఫున ఆడినప్పటి నుండి రెండు సంవత్సరాలకు పైగా అయ్యింది. అతను చివరిసారిగా జూలై 2023లో భారతదేశం తరపున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుండి సెలెక్టర్లు అతనికి అవకాశం ఇవ్వలేదు. అతని గత రెండు దేశీయ సీజన్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ, పోరాటాన్ని వదులుకోని రహానే, ఇప్పటికీ తిరిగి రావాలని ఆసక్తిగా ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి