Ajinkya Rahane: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అజింక్య రహానే అద్భుతాలు చేశాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఛెతేశ్వర్ పుజారా వంటి బ్యాట్స్‌మెన్ ఘోరంగా పరాజయం పాలైన ఓవల్ మైదానంలో.. రహానే ఒక్కడే ఆస్ట్రేలియా బౌలర్లకు అడ్డుగోడలా నిలిచాడు. ఫైనల్ మూడొ రోజు 92 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి టీమిండియాను ఫాలో ఆన్ నుంచి కాపాడే పనిలో సక్సెస్ అయ్యాడు.
18 నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రహానే.. రీఎంట్రీలోనే హాఫ్ సెంచరీతోపాటు నంబర్‌వన్‌గా నిలిచాడు. పాట్ కమిన్స్ బౌలింగ్ లో సిక్సర్ బాదిన రహానే 50 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో అర్ధశతకం సాధించిన తొలి భారతీయుడిగా కూడా నిలిచాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో రహానే భారత్‌కు గోడలా నిలిచాడు. గిల్, రోహిత్, కోహ్లి, పుజారా ఎవరూ 15 పరుగులకు మించి చేరుకోలేకపోయారు. అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు భారత్ టాప్ ఆర్డర్ పూర్తిగా పరాజయం పాలైంది.
A top class fifty for Rahane ?
Follow the #WTC23 Final ? https://t.co/wJHUyVnX0r pic.twitter.com/Q39nR5r1cT
— ICC (@ICC) June 9, 2023
క్లిష్ట పరిస్థితులను ఎదుక్కొని జట్టులోకి తిరిగి వచ్చాడు. రహానే 11 జనవరి 2022 తర్వాత తన మొదటి టెస్ట్ ఆడాడు. కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను ఫ్లాప్ అయ్యాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు.
5️⃣0️⃣ and going strong!
Ajinkya Rahane reaches his half-century with a maximum ????
Follow the match ▶️ https://t.co/0nYl21pwaw#TeamIndia | #WTC23 | @ajinkyarahane88 pic.twitter.com/LBIt6lx01p
— BCCI (@BCCI) June 9, 2023
రహానే-శార్దూల్ జోడీ భారత్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చింది. ఈ సెషన్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ మూడు క్యాచ్‌లు ఇవ్వగా, ఆస్ట్రేలియా ఫీల్డర్లు మిస్ చేశారు. ప్రస్తుతం ఫాలో ఆన్‌కి భారత్ కేవలం 10 పరుగుల దూరంలో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. లంచ్ వరకు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 260 పరుగులు చేసింది. అజింక్యా రహానే 89, శార్దూల్ ఠాకూర్ 36 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరి మధ్య 103 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. రహానే కెరీర్‌లో 26వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని 5000 టెస్ట్ పరుగులు కూడా పూర్తయ్యాయి.
5 పరుగులకే కేఎస్ భరత్ ఔటయ్యాడు. అతను స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..