IND Vs ENG: మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!

ఇంగ్లాండ్ అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి అదరగొట్టాడు. 6 ఓవర్లు బౌలింగ్ వేసి 10 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ పడగొట్టాడు. యూత్ టెస్ట్ మ్యాచ్‌లలో వికెట్ తీసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.

IND Vs ENG: మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!
Vaibhav Suryavanshi

Updated on: Jul 15, 2025 | 12:55 PM

ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో ఈ వన్డే సిరీస్‌లో ఒక సెంచరీతో సహా మొత్తం 355 పరుగులు చేశాడు. యూత్ వన్డే సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో వైభవ్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో యూత్ వన్డేల్లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. ఇక ఇప్పుడు భారత అండర్-19 జట్టు, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగిన తొలి యూత్ టెస్ట్ మ్యాచ్‌లో వైభవ్ తన బ్యాటింగ్‌తో కాదు బౌలింగ్‌తో దుమ్ములేపాడు. ఇంగ్లాండ్ అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 6 ఓవర్లు బౌలింగ్ వేసి 10 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ పడగొట్టాడు. ఇంగ్లాండ్ అండర్-19 కెప్టెన్ హంజా షేక్ వికెట్ తీసి.. అతడ్ని పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్‌తో అతడు చరిత్ర సృష్టించడమే కాదు.. యూత్ టెస్ట్ మ్యాచ్‌లలో వికెట్ తీసిన అతి పిన్న వయస్కుడైన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ వికెట్ తీసేటప్పటికి వైభవ్ వయస్సు 14 సంవత్సరాల 107 రోజులు.

IPL 2025లో అద్భుతమైన ప్రదర్శన..

ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. రేటుకు తగ్గట్టుగా IPL 2025లో అద్భుతంగా రాణించాడు వైభవ్. 2025 సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.

భారత అండర్-19 జట్టు ఘన విజయం..

ఇంగ్లాండ్ అండర్-19తో జరిగిన తొలి యూత్ టెస్ట్ మ్యాచ్‌లో, భారత అండర్-19 జట్టు మొదట బ్యాటింగ్ చేసి 540 పరుగులు చేసింది. భారతదేశం తరపున ఆయుష్ మాత్రే 102 పరుగుల సెంచరీ సాధించాడు. అతనితో పాటు, అభిజ్ఞాన్ కుందు 90 పరుగులు, రాహుల్ కుమార్ 85 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 439 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత అండర్-19 జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..