ఆఫ్ఘనిస్తాన్‌పై విండీస్ విజయం

| Edited By:

Jul 04, 2019 | 11:05 PM

ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్.. 312 పరుగుల విజయలక్ష్యాన్ని ఆఫ్ఘన్ ముందు ఉంచింది. అయితే బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘన్.. లక్ష్యాన్ని చేధించలేకపోయింది. నిర్జీత 50 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్‌లో అహ్మద్ షా 62, ఇక్రం 86, అస్గర్ 40, షిజాద్ 25 పరుగులు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి […]

ఆఫ్ఘనిస్తాన్‌పై విండీస్ విజయం
Follow us on

ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్.. 312 పరుగుల విజయలక్ష్యాన్ని ఆఫ్ఘన్ ముందు ఉంచింది. అయితే బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘన్.. లక్ష్యాన్ని చేధించలేకపోయింది. నిర్జీత 50 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్‌లో అహ్మద్ షా 62, ఇక్రం 86, అస్గర్ 40, షిజాద్ 25 పరుగులు చేశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటింగ్‌లో హోప్ 77, లివీస్ 58, పూరన్ 58, హోల్డర్ 45 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలింగ్‌లో జార్దన్ 2, సయేద్, నబీ, రషీద్ తలో వికెట్ తీశారు.