
టీ20 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ రెండో విజయాన్ని అందుకుంది. అబుదాబీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ విధించిన 161 పరుగుల టార్గెట్‌ను చేధించడంలో నమీబియా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్ల దెబ్బకు ఒకరు తర్వాత ఒకరు వరుసపెట్టి తక్కువ పరుగులకే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి నమీబియా 9 వికెట్లు నష్టపోయి 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్ వీస్(26) తప స్కోరర్. అటు ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్‌లు మూడేసి వికెట్లు పడగొట్టగా.. గుల్బదిన్ నైబ్ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌కు.. ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. హజ్రతుల్లా(33), షాజాద్(45) మొదటి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే అస్ఘర్ ఆఫ్ఘన్(31), నబి(32) వేగంగా పరుగులు రాబట్టడంతో ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో రుబెన్, లోఫ్తీ చెరో రెండు వికెట్లు, స్మిత్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ 4 పాయింట్లతో గ్రూప్ 2లో రెండో స్థానానికి ఎగబాకింది.