AFG vs AUS: హాఫ్ సెంచరీలతో చేలరేగిన అటల్, ఒమర్జాయ్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్..

ఛాంపియన్స్ ట్రోఫీలో 10వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాకు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుక్రవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ తరఫున సెదికుల్లా అటల్ 85, అజ్మతుల్లా ఒమర్జాయ్ 67 పరుగులు చేశారు. బెన్ ద్వార్షిస్ 3 వికెట్లు పడగొట్టాడు. స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

AFG vs AUS: హాఫ్ సెంచరీలతో చేలరేగిన అటల్, ఒమర్జాయ్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్..
Afg Vs Aus

Updated on: Feb 28, 2025 | 6:20 PM

Afghanistan vs Australia, 10th Match, Group B: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా 10వ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య లాహోర్‌లోని గడాఫీ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఆఫ్ఘాన్ జట్టు 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు 274 పరుగుల టార్గెట్ విధించింది. సెదికుల్లా అటల్, ఒమర్జాయ్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా పేరుగాంచిన ఒమర్జాయ్ తన వన్డే కెరీర్‌లో 8వ అర్ధ సెంచరీ సాధించాడు. రషీద్ ఖాన్ (19 పరుగులు) బెన్ ద్వార్షిస్ బౌలింగ్ లో గ్లెన్ మాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గుల్బాదిన్ (4 పరుగులు) నాథన్ ఎల్లిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మహ్మద్ నబీ ఒక్క పరుగుకే రనౌట్ అయ్యాడు.

ఆడమ్ జంపా కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20 పరుగులు), ఇబ్రహీం జాద్రాన్ (22 పరుగులు)లను అవుట్ చేశాడు. స్పెన్సర్ జాన్సన్ సెదికుల్లా అటల్ (85 పరుగులు), రహ్మానుల్లా గుర్బాజ్ (0) వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ మాక్స్వెల్ రెహ్మత్ షా (12 పరుగులు) వికెట్ తీసుకున్నాడు.

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (wk), గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.

ఇవి కూడా చదవండి

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us