Team India: 18 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు.. హార్దిక్ పాండ్య తాట తీసిన కాటేరమ్మ కొడుకు..

SMAT 2025: క్రీజులోకి వచ్చిన వెంటనే అభిషేక్ శర్మ దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 4 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. అంటే తాను చేసిన 50 పరుగులలో 44 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం విశేషం.

Team India: 18 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు.. హార్దిక్ పాండ్య తాట తీసిన కాటేరమ్మ కొడుకు..
Abhishek Sharma

Updated on: Dec 02, 2025 | 1:46 PM

Abhishek Sharma: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో పంజాబ్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్‌తో మరోసారి సంచలనం సృష్టించాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లోనూ అభిషేక్ ఎక్కడా తగ్గలేదు.

క్రీజులోకి వచ్చిన వెంటనే అభిషేక్ శర్మ దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 4 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. అంటే తాను చేసిన 50 పరుగులలో 44 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం విశేషం. బరోడా స్టార్ బౌలర్ హార్దిక్ పాండ్యా వేసిన బంతులను కూడా అభిషేక్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పాండ్యా వేసిన 4 బంతుల్లోనే ఒక సిక్స్, ఒక ఫోర్‌తో సహా 12 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రసిక్ సలామ్ బౌలింగ్‌లో అయితే ఏకంగా 8 బంతుల్లో 25 పరుగులు పిండుకున్నాడు.

ఇది కూడా చదవండి: IPL 2026 Auction: లక్ అంటే వీళ్లదే భయ్యో.. వేలంలో ఏకంగా 70 కోట్లతో రికార్డుల ఊచకోత.. ఎవరంటే?

ఇవి కూడా చదవండి

పంజాబ్ భారీ స్కోరు..

అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (18 బంతుల్లో 50) తో పాటు, అన్మోల్‌ప్రీత్ సింగ్ కూడా 32 బంతుల్లో 69 పరుగులతో రాణించడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. మరోవైపు బరోడా బౌలర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు.

ఇది కూడా చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రూ. 92 కోట్లు.. కట్‌చేస్తే.. వేలం నుంచి డేంజరస్ ప్లేయర్ ఔట్..

సూపర్ ఫామ్‌లో అభిషేక్ అభిషేక్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే 148 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో అతను 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం.

త్వరలో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు అభిషేక్ శర్మ ఇలాంటి ప్రదర్శన చేయడం భారత జట్టుకు శుభసూచకం. డిసెంబర్ 9న జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ తన బ్యాటింగ్ పవర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..