
Abhishek Sharma Sanju Samson Opening Record: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌లో అదిరిపోయే ఆరంభం చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజూ శాంసన్ – అభిషేక్ శర్మ జోడీ ఓపెనింగ్ వికెట్‌కు కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నీలో తొలిసారిగా భారత ఓపెనర్లు ఇంత దూకుడుగా బ్యాటింగ్ చేసి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇండియా vs జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ – అభిషేక్ శర్మల మధ్య 48 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇది టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ తరఫున ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్. టోర్నీలో ముందుగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో భారత ఓపెనర్లు ఇంత స్కోర్ కూడా సాధించలేకపోయారు. ఈ భాగస్వామ్యంతో పవర్‌ప్లేలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది.
జింబాబ్వేతో మ్యాచ్‌లో 23 బంతుల్లో 48 పరుగులు జోడించారు. ఇందులో సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ముజరబానీ బౌలింగ్‌లో సంజూ ఔట్ కావడంతో ఈ ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది.
ఈ భాగస్వామ్యం మొత్తం 48 పరుగులకు చేరుకున్నప్పటికీ, 27వ పరుగుకే ఈ టోర్నీలో భారత్‌కు ఉన్న గత ఓపెనింగ్ రికార్డును దాటేశారు. అంటే ఇప్పటివరకు భారత ఓపెనింగ్ జోడీ ఎంతగా విఫలమైందో ఈ ఒక్క మ్యాచ్ స్పష్టంగా చూపించింది.
ఈ జింబాబ్వే మ్యాచ్‌లో వచ్చిన 48 పరుగుల ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్, భారత్ గత ఐదు మ్యాచ్‌లలో ఓపెనర్లు చేసిన మొత్తం పరుగుల కంటే ఎక్కువ. గత ఐదు మ్యాచ్‌ల్లో భారత ఓపెనర్లు కలిపి కేవలం 34 పరుగులు మాత్రమే జోడించారు.
సంజూ శాంసన్ ఔట్ అయిన తర్వాత కూడా అభిషేక్ శర్మ క్రీజ్‌పై నిలబడి నిలకడగా ఆడాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌లో కనిపించిన అభిషేక్ కంటే జింబాబ్వే మ్యాచ్‌లో పూర్తిగా భిన్నంగా కనిపించాడు. ఆ తర్వాత ఈశాన్ కిషన్‌తో కలిసి అభిషేక్ పవర్‌ప్లేలోనే భారత్ స్కోరును 80 పరుగుల వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ తిరిగి తన పాత ఫామ్‌ను అందుకుంటున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..