Video: అందుకే గొడవ పెట్టుకున్న..! రౌఫ్‌తో మాటల యుద్ధంపై అసలు విషయం పెట్టిన అభిషేక్‌ శర్మ!

ఆసియా కప్ 2025లోని భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, హరీస్ రౌఫ్ మధ్య జరిగిన తీవ్రమైన గొడవ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారత ఓపెనర్లు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌ను ఓడించగా, పాకిస్థాన్ ఆటగాళ్ళు అకారణంగా వారిపై దాడి చేయడంతో గొడవ మొదలైంది.

Video: అందుకే గొడవ పెట్టుకున్న..! రౌఫ్‌తో మాటల యుద్ధంపై అసలు విషయం పెట్టిన అభిషేక్‌ శర్మ!
ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ నంబర్ 1: శ్రీలంకతో జరుగుతోన్న సూపర్ ఫోర్ మ్యాచ్‌లో 34 పరుగులు చేసిన వెంటనే అభిషేక్ శర్మ, టీ20 ఆసియా కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఘనత సాధించడానికి అతను పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులను అధిగమించాడు. అభిషేక్ ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 282 పరుగులు చేశాడు. టీ20 ఆసియా కప్‌లో ఒకే ఎడిషన్‌లో ఏ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగులు ఇదే కావడం గమనార్హం.

Updated on: Sep 22, 2025 | 7:18 AM

ఆసియా కప్‌ 2025లో భాగంగా ఆదివారం జరిగిన భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఫైటర్‌ జెట్‌ యాక్షన్‌తో వివాదానికి కారణమైన హరీస్‌ రౌఫ్‌.. ఆ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మతో గొడవకు దిగి మరో కాంట్రవర్సీకి సెంటర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌ ఇచ్చిన టార్గెట్‌ను తమ సూపర్‌ బ్యాటింగ్‌తో సులువుగా మార్చేశాడు భారత ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌. ఇది ఏ మాత్రం జీర్ణించుకోలేని పాకిస్థాన్‌ ఆటగాళ్లు అకారణంగా అభిషేక్‌, గిల్‌ను గెలకడం మొదలుపెట్టారు.

చాలా సేపు ఓపిక పట్టిన అభిషేక్‌ శర్మ ఇక లాభం లేదనుకొని.. పాక్‌ ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అన్నాడు. అసలే యువ రక్తం.. పైగా ముందున్నది పగోడు.. ఊరుకుంటాడు హరీస్‌ రౌఫ్‌కు ఇచ్చిపడేశాడు. కొద్ది సేపు అభిషేక్‌, రౌఫ్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ గొడవపై మ్యాచ్‌ తర్వాత స్పందించిన అభిషేక్‌ శర్మ తాను పాక్‌ ఆటగాడితో ఎందుకు వాగ్వాదానికి దిగాల్సి వచ్చిందో వెల్లడించాడు. ‘వాళ్ళు ఎటువంటి కారణం లేకుండా మా మీదకు వస్తున్న తీరు నాకు అస్సలు నచ్చలేదు, అందుకే నేను వాళ్ళ వెంటపడ్డాను’ అంటూ కుండబద్దలు కొట్టేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పాక్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్‌ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫర్హాన్‌ 58 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో శివమ్‌ దూబె 2 వికెట్లు తీసుకున్నాడు. హార్ధిక్‌ పాండ్యా, కుల్దీప్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇక 172 పరుగుల టార్గెట్‌ను భారత్‌ 18.5 ఓవర్లలో ఫినిష్‌ చేసింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అభిషేక్‌ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేసి షేకాడించాడు. గిల్‌ 47, తిలక్‌ వర్మ 30 పరుగులు చేసి రాణించారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి