
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు (India national cricket team) సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో కీలక పోరు ఆడుతోంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో (Wankhede Stadium) జరుగుతుంది. అయితే ఈ టోర్నమెంట్ మొత్తం భారత్ జట్టుకు ఒక ఆటగాడు భారంగా మారాడనే చర్చలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ అతను నిరాశపరిచాడు. అయినప్పటికీ సెమీఫైనల్‌లో అతనికి మరోసారి అవకాశం దక్కింది. టీం మేనేజ్మెంట్ కూడా వరుసగా ఛాన్స్ లు ఇస్తోంది. కానీ, ఈ ప్లేయర్ మాత్రం వరుసగా నిరాశపరుస్తూనే ఉన్నాడు.
ఈ ఆటగాడు మరెవరో కాదు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma). టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అతనిపై భారీ అంచనాలు ఉండేవి. కానీ, ప్రారంభంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డక్‌గా అవుట్ కావడంతో ఆ అంచనాలు తగ్గిపోయాయి. సూపర్-8 దశలో జింబాబ్వేపై మాత్రం అర్ధశతకం సాధించాడు. కానీ మిగతా మ్యాచ్‌ల్లో అతని స్కోర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇది ఆందోళనగా మారింది.
అభిషేక్ శర్మ ఎడమచేతి స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు. కానీ ఈ టోర్నమెంట్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అతనికి చాలా తక్కువ అవకాశాలు ఇచ్చాడు.
నెదర్లాండ్స్‌పై ఒక ఓవర్ మాత్రమే వేసిన అభిషేక్ 10 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత అతనికి బౌలింగ్ చేయడానికి అవకాశం రాలేదు.
ఫీల్డింగ్‌లో కూడా అతని ప్రదర్శన అంతగా లేదు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అతను రెండు సులభమైన క్యాచ్‌లు వదిలేశాడు.
మొదట రోష్టన్ ఛేజ్ (Roston Chase) క్యాచ్ వదిలేశాడు, తరువాత అతను 40 పరుగులు చేశాడు. అలాగే రోమన్ పావెల్ (Rovman Powell) క్యాచ్ కూడా వదిలాడు. ఆ తరువాత అతను 34* పరుగులు చేశాడు. ఈ తప్పిదాలు మ్యాచ్‌ను కష్టతరం చేశాయి.
టోర్నమెంట్‌లో పెద్దగా రాణించకపోయినా సెమీఫైనల్‌లో అభిషేక్ శర్మకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే, ఇదే వేదిక అయిన వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై అతను గతంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లో శతకం చేసి సంచలనం సృష్టించాడు. అందుకే ఈసారి కూడా అతను అదే ఫామ్‌ను పునరావృతం చేస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశించింది. కానీ, అభిషేక్ శర్మ మాత్రం 7 బంతులు మాత్రమే ఆడే 9 పరుగులు చేసి మరోసారి నిరాశ పరిచాడు.
భారత్ ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే మార్చి 8న నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అక్కడ న్యూజిలాండ్ జట్టు (New Zealand national cricket team) తో ఫైనల్ ఆడే అవకాశం ఉంది. అయితే, ఓడిపోతే భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.