
Abhishek Sharma: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. కటక్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో అతను కేవలం 17 పరుగులు చేసి నిరాశపరిచినప్పటికీ, రాబోయే మ్యాచ్‌లలో ఒక భారీ రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం అతనికి ఉంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 9 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టడానికి అభిషేక్ శర్మకు కేవలం 99 పరుగులు మాత్రమే అవసరం.
ఈ ఏడాది టీమిండియాకు ఇంకా 4 టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నాలుగు ఇన్నింగ్స్‌లలో అభిషేక్ శర్మ గనుక 99 పరుగులు చేయగలిగితే, ఒకే ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ముఖ్యంగా, డిసెంబర్ 11న చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ అభిషేక్ శర్మకు చాలా కీలకం. ఎందుకంటే ఇది అతనికి సొంత మైదానం. కాబట్టి, అక్కడ భారీ స్కోరు సాధించి ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..