రీ-ఎంట్రీకి డిమాండ్ చేయలేదు – డివిలియర్స్

| Edited By: Srinu

Jul 13, 2019 | 4:12 PM

కేప్‌టౌన్‌: వరల్డ్‌కప్ జట్టులోకి తాను పునరాగమనం కోసం ప్రయత్నించానని వస్తున్న వార్తలపై ఎట్టికేలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. జట్టులోకి రావడం కోసం తాను బోర్డును డిమాండ్ గానీ, ఇబ్బంది గానీ పెట్టలేదని స్పష్టం చేశాడు. ఇక ప్రపంచకప్‌లో సఫారీల జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కుంటున్న తరుణంలో ఏబీ డివిలియర్స్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తాడన్న వార్తలు అప్పట్లో పెద్ద సంచలనమైన విషయం తెలిసిందే. ‘నేను జట్టులోకి పునరాగమనం చేయడానికి ఎటువంటి డిమాండ్ చేయలేదు. బోర్డు […]

రీ-ఎంట్రీకి డిమాండ్ చేయలేదు - డివిలియర్స్
Follow us on

కేప్‌టౌన్‌: వరల్డ్‌కప్ జట్టులోకి తాను పునరాగమనం కోసం ప్రయత్నించానని వస్తున్న వార్తలపై ఎట్టికేలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. జట్టులోకి రావడం కోసం తాను బోర్డును డిమాండ్ గానీ, ఇబ్బంది గానీ పెట్టలేదని స్పష్టం చేశాడు. ఇక ప్రపంచకప్‌లో సఫారీల జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కుంటున్న తరుణంలో ఏబీ డివిలియర్స్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తాడన్న వార్తలు అప్పట్లో పెద్ద సంచలనమైన విషయం తెలిసిందే.

‘నేను జట్టులోకి పునరాగమనం చేయడానికి ఎటువంటి డిమాండ్ చేయలేదు. బోర్డు కూడా నాపై ఎటువంటి ఒత్తిడి చేయలేదని డివిలియర్స్ తెలిపాడు. అయితే రిటైర్మెంట్‌ను ప్రకటించిన తర్వాత వరల్డ్‌కప్‌లో తన అవసరం ఉంటే తప్పకుండా ఆడతానని చెప్పినట్లు పేర్కొన్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ తనకు బాల్య మిత్రుడని.. ఏడాది ముందు అతనితో మాట్లాడినప్పుడు జట్టుకు ఎంతో అవసరమైతేనే తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశానన్నాడు.

వరల్డ్‌కప్‌కు 15 మంది సభ్యులను ప్రకటించడానికి 24 గంటల ముందు కూడా బోర్డే తనను ఎంపికకు అందుబాటులో ఉంచిందని తెలిపాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రోజే ఏ అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో ఆడనని స్పష్టం చేశానని.. మరి అలాంటప్పుడు జట్టులో చోటు కోసం ఎలా ప్రయత్నిస్తానని డివిలియర్స్ పేర్కొన్నాడు.

మరోవైపు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమి అనంతరం తమ మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలు బయటకు రావడం ఎంతో బాధించిందన్నాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించానని డివిలియర్స్ స్పష్టం చేశాడు. కాగా డివిలియర్స్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ మద్దతు తెలిపారు.