Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లి తీరుతా.. ఎవరైనా, ఏమైనా చేసుకోండి: హర్భజన్‌ సింగ్‌

|

Jan 20, 2024 | 1:20 PM

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మహాక్రతువు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఈ చారిత్రాత్మక ఘట్టంపై రాజకీయాలు సాగుతున్నాయి. ఇది బీజేపీ కార్యక్రమమంటూ ప్రతి పక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లి తీరుతా.. ఎవరైనా, ఏమైనా చేసుకోండి: హర్భజన్‌ సింగ్‌
Harbhajan Singh
Follow us on

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మహాక్రతువు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఈ చారిత్రాత్మక ఘట్టంపై రాజకీయాలు సాగుతున్నాయి. ఇది బీజేపీ కార్యక్రమమంటూ ప్రతి పక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరుకాలేమంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఇందులో ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఉంది. సాకాత్తూ ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ అయోధ్య వేడుకకు తాను హాజరుకావడం లేదని ప్రకటించారు. అయితే ఆదే పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ మాత్రం ఒక ఆశ్యర్యకరమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. పార్టీలతో తనకు సంబంధం లేదని, ఎవరేమనుకున్నా అయోధ్య రాముడి ఉత్సవానికి వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఏఎన్‌ఐతో మాట్లాడిన భజ్జీ ‘అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లడం లేదన్న అంశాలతో నాకు సంబంధం లేదు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు వెళ్లకూడదనుకుంటే అది వారి ఇష్టం. నేను మాత్రం కచ్చితంగా అయోధ్యకు వెళతాను. ఒక సామాన్య వ్యక్తిగా నాకు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. నేను అయోధ్యకు వెళ్లడంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉండే నేనేమీ చేయలేదు. ఈ విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నేను పట్టించుకోను’ అని చెప్పుకొచ్చాడు.

ఆప్‌ పార్టీనేతలందరూ అయోధ్య రాముడి కార్యక్రమానికి వెళ్లడం లేదంటూ ప్రకటనలిస్తోన్న తరుణంలో హర్భజన్‌ సింగ్‌ స్టేట్‌మెంట్ ఆశ్చర్యకరంగా మారింది. పంజాబ్‌ నుంచి ఆప్‌ ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు హర్భజన్‌ సింగ్‌. మరి భజ్జీ నిర్ణయంపై ఆప్‌ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. టీమిండియా క్రికెటర్ల విషయానికొస్తే.. భజ్జీతో పాటు ఎంఎస్‌ ధోని, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్‌ అశ్విన్‌ తదితరలుకు అయోధ్య నుంచి ఆహ్వానాలు అందాయి.

ఇవి కూడా చదవండి

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై హర్భజన్ సింగ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..