IPL 2025: ఫ్రాంచైజీల గొంతెమ్మ కోరికలు.. బీసీసీఐ ముందు 3 బిగ్ డిమాండ్‌లు.. అవేంటో తెల్సా

|

Jul 25, 2024 | 12:31 PM

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31న ఆక్షన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మెగా వేలం నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని ఫ్రాంఛైజీలు బోర్డును అభ్యర్ధించాయి.

IPL 2025: ఫ్రాంచైజీల గొంతెమ్మ కోరికలు.. బీసీసీఐ ముందు 3 బిగ్ డిమాండ్‌లు.. అవేంటో తెల్సా
Ipl 2025 Mega Auction
Follow us on

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31న ఆక్షన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మెగా వేలం నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని ఫ్రాంఛైజీలు బోర్డును అభ్యర్ధించాయి. వాటిల్లో ఎక్కువ మంది ఫ్రాంచైజీల ఓనర్లు 3 బిగ్ డిమాండ్‌లు క్రికెట్ బోర్డు ముందు ఉంచినట్టు తెలుస్తోంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: మీ చేతి వేళ్లు మీరెలాంటి వారో చెప్పేస్తాయట..! అదెలాగో తెల్సా

1. ఐదేళ్లకొకసారి మెగా వేలం:

ఐదేళ్లకు ఒకసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహించాలని చాలామంది ఫ్రాంచైజీల ఓనర్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతి మూడేళ్లకోసారి మెగా వేలం నిర్వహించేవారు. ఈ నిబంధనను మార్చి.. ఐదేళ్లకొకసారి మెగా వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. అంటే ఈసారి మెగా వేలం నిర్వహిస్తే తదుపరి మెగా వేలం 2029లో జరగాలి. మధ్యలో మినీ వేలం మాత్రమే నిర్వహించాలని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

2. రిటైన్ చేసిన ఆటగాళ్ల సంఖ్య:

మెగా వేలానికి ముందు 4 నుంచి 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలని ఫ్రాంచైజీలు అభ్యర్థించాయి. మునుపటి మెగా వేలంలో గరిష్టంగా 4 మంది ఆటగాళ్లను ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి ఆ సంఖ్యను 4 నుంచి 6కి పెంచాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి.

ఇది చదవండి: సుధీర్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో బబ్లీ.. ఇప్పుడు చూస్తే మత్తెక్కాల్సిందే

3. RTM ఎంపిక:

మెగా వేలానికి ముందు 8 మంది ఆటగాళ్లపై RTMను అనుమతించాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. RTM అంటే రైట్ టూ మ్యాచ్ ఆప్షన్. అనగా RTM ఆప్షన్‌ని ఉపయోగించి.. వేలంలోకి వెళ్లిన తమ జట్టు ఆటగాళ్లను మళ్లీ వేలం ధరకే కొనుగోలు చేయవచ్చు. కాగా, బీసీసీఐ ముందు ఫ్రాంచైజీలు ఉంచిన ఈ మూడు డిమాండ్లను బోర్డు పరిశీలిస్తోంది. దీనిపై ఈ నెలాఖరున జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ.

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..