టీ20ల్లో బోరింగ్ బ్యాట్స్‌మెన్ వీరే.. కెరీర్‌లో ఒక్క సిక్స్ కొట్టలేదు.. లిస్టులో ధోని సహచరుడు..

T20 Cricket: టెస్ట్ క్రికెట్.. ఆ తర్వాత వన్డేలు ఇది ఒక్కప్పటి క్రికెట్ తీరు.. కానీ ఎప్పుడైతే టీ20 ఫార్మాట్ వచ్చిందో.. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ తీరుతెన్నులు మారిపోయాయి.

టీ20ల్లో బోరింగ్ బ్యాట్స్‌మెన్ వీరే.. కెరీర్‌లో ఒక్క సిక్స్ కొట్టలేదు.. లిస్టులో ధోని సహచరుడు..
Cricket
Follow us

|

Updated on: Dec 07, 2022 | 9:42 AM

టెస్ట్ క్రికెట్.. ఆ తర్వాత వన్డేలు ఇది ఒక్కప్పటి క్రికెట్ తీరు.. కానీ ఎప్పుడైతే టీ20 ఫార్మాట్ వచ్చిందో.. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ తీరుతెన్నులు మారిపోయాయి. ప్రస్తుతం ఫ్యాన్స్ అందరికీ పొట్టి ఫార్మాట్ అంటే పిచ్చ క్రేజ్. దీనికి తగ్గట్టుగానే కొందరు బ్యాటర్లు టీ20ల్లో మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలర్లను కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం చేస్తూ.. ప్రత్యర్ధులను రఫ్ఫాడిస్తున్నారు. ఇక కొందరు మాజీ క్రికెటర్లు టీ20 క్రికెట్‌ను సరిగ్గా వినియోగిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ మాదిరి క్రికెట్ కూడా అత్యంత పాపులర్ స్పోర్ట్‌గా పేరు పొందుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియాలో ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి వివిధ దేశాల్లో వేర్వేరు టీ20 లీగ్‌లు రూపుదిద్దుకున్నాయి. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను కూడా త్వరలోనే పెంచుతామని ఐసీసీ ఇటీవలే ప్రకటించిన విషయం విదితమే. ఈ నిర్ణయం అమలైతే.. అటు రెవిన్యూ.. ఇటు ప్రేక్షకాదరణ అమాంతం పెరగడం ఖాయం. సరే ఇవన్నీ పక్కన పెడితే.. టీ20 లీగ్ అంటేనే గుర్తొచ్చేది సిక్సర్ల హోరు.. ఫోర్ల జోరు.. ఆకాశమే హద్దుగా బ్యాటర్లు చెలరేగిపోతే.. ఫ్యాన్స్ ఈలలు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. మరి అలాంటి ఈ పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటిదాకా ఒక్క సిక్స్ కూడా కొట్టని ఎనిమిది మంది ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ లిస్టు ఇదే.. జాబితాలో ధోని సహచరుడు:

  • అంబటి రాయుడు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న అంబటి రాయుడు ఆడిన అంతర్జాతీయ టీ20లు చాలా తక్కువే. కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రాయుడు.. 5 ఇన్నింగ్స్‌లలో 42 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 4 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క సిక్స్ కూడా బాదలేదు.
  • ఆండ్రీ స్ట్రాస్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రీ స్ట్రాస్ ఆడింది కేవలం 4 టీ20 మ్యాచ్‌లు.. 18.25 యావరేజ్‌తో కొట్టింది 73 పరుగులు. ఇందులో 9 ఫోర్లు ఉండగా.. ఒక్క సిక్స్ కూడా లేదు.
  • మైకేల్ వాన్: ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కూడా టీ20ల్లో ఒక్క సిక్స్ బాదలేదు. కెరీర్లో ఆడింది 2 టీ20 మ్యాచ్‌లు.. 13.50 సగటుతో కొట్టింది కేవలం 27 పరుగులు. ఇందులో 4 ఫోర్లు ఉన్నాయి.
  • ఇమామ్ ఉల్ హక్: పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఎక్కువగా వన్డేలు ఆడాడు. ఇప్పటిదాకా 43 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన ఇమామ్ 16 సిక్సర్లు కొట్టగా.. టీ20ల్లో మాత్రం ఒక్క సిక్స్ బాదలేదు. ఎందుకంటే అతడు ఆడింది కేవలం 2 మ్యాచ్‌లు.. కొట్టింది 2 ఫోర్లు.
  • స్టీఫెన్ ఫ్లెమింగ్: ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆడింది కేవలం 5 టీ20 మ్యాచ్‌లు 20 ఫోర్లతో కొట్టింది 110 పరుగులు.
  • ర్యాన్ మెక్‌లారెన్: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ర్యాన్ మెక్‌లారెన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆడింది కేవలం 12 టీ20 మ్యాచ్‌లు.. అందులో అతడు ఒక్క సిక్స్ కొట్టకపోగా.. తన బ్యాట్ నుంచి వచ్చింది కేవలం 9 పరుగులు మాత్రమే.
  • మర్వన్ ఆటపట్టు: ఈ మాజీ శ్రీలంక ప్లేయర్ టెస్ట్ స్పెషలిస్ట్, వన్డేల్లో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. కానీ టీ20ల్లో ఎక్కువగా ఆడలేదు. తన కెరీర్‌లో ఆడింది కేవలం ఒక్క టీ20 మ్యాచ్.. చేసింది 5 పరుగులు మాత్రమే.
  • డానియల్ క్రిస్టియన్: ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆడింది 16 మ్యాచ్‌లు.. కొట్టింది 27 పరుగులు. ఇందులో కేవలం 2 ఫోర్లు మాత్రమే ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.