IPL Auction 2025: ఐపీఎల్ వేలం చివరి దశకు చేరుకుంది. మొత్తం 10 జట్లు తమ జట్టుకు తుది మెరుగులు దిద్దాలని చూస్తున్నాయి. వేలం ఇప్పుడు మిగిలి ఉన్న స్లాట్‌ల సంఖ్య, మిగిలి ఉన్న పర్స్ ఆధారంగా ఆగ్జలరేటెడ్ బిడ్డింగ్‌కు మారనుంది. ఈ దశలో, 10 జట్లకు మిగిలిన ఆటగాళ్ల జాబితాను సమర్పిస్తారు. ఆ తర్వాత వేలంలో బిడ్డింగ్ కోసం స్పీడ్ రౌండ్ బిడ్డింగ్‌లో అన్ సోల్డ్ ప్లేయర్లను ప్రవేశపెడతారు. షార్ట్‌లిస్ట్ చేయని ఆటగాళ్లను బిడ్డింగ్‌కు పిలవరు.
1. శార్దూల్ ఠాకూర్..
భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆశ్చర్యకరంగా ప్రారంభ బిడ్డింగ్ సమయంలో కొనుగోలుదారులను ఆకర్షించలేకపోయాడు. రూ. 2 కోట్ల ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆల్ రౌండర్ అటు బ్యాట్, ఇటు బౌల్‌తో సహకారం అందించగలడు.
2. గ్లెన్ ఫిలిప్స్..
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ప్రారంభ దశలో ఎలాంటి బిడ్‌లను అందుకోలేదు. కివీ ఆఫ్ స్పిన్నర్ లోయర్-ఆర్డర్ హిట్టర్. అంతేకాకుండా, ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఫిలిప్స్ కూడా ఒకడు.
3. మయాంక్ అగర్వాల్..
భారత టాప్ ఆర్డర్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ఆగ్జలరేటెడ్ బిడ్డింగ్‌లో మరోసారి తన అదృష్టాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఈ 33 ఏళ్ల ప్లేయర్ IPLలో అనుభవజ్ఞుడైన ఓపెనర్‌గా ఆకట్టుకున్నాడు.
4. దేవదత్ పడిక్కల్..
మరో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా ఏ ఫ్రాంచైజీని ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేయవచ్చు.
5. కార్తీక్ త్యాగి..
భారత పేసర్ కార్తీక్ త్యాగి కూడా వేలంలోకి తిరిగి రావచ్చు. ఈ 24 ఏళ్ల పేసర్ గత ఐపీఎల్ ఎడిషన్లలో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..