IND vs ENG 3rd ODI: 3వ వన్డే థీమ్‌ ఇదే.. జైషా కీలక వ్యాఖ్యలు

IND vs ENG 3rd ODI: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షా కీలక విషయాలు ప్రకటించాడు. ఓ థీమ్‌తో మూడో వన్డే నిర్వహించనున్నట్లు తెలిపారు.

IND vs ENG 3rd ODI: 3వ వన్డే థీమ్‌ ఇదే.. జైషా కీలక వ్యాఖ్యలు
India Vs England

Updated on: Feb 10, 2025 | 3:14 PM

ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షా కీలక ప్రకటన చేశారు. “అవయవ దానం, ప్రాణాలను కాపాడండి” అనే థీమ్‌తో మూడో వన్డేను జరపించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మ్యాచ్ ద్వారా అవయవ దాన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం క్రికెట్ వేదికను ఉపయోగించి అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు అవయవ దానం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించి, ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలంతా ప్రతిజ్ఞ చేసేలా ప్రోత్సహించాలని ఈ మేరకు పిలుపునిచ్చాడు.

భారతదేశంలో అవయవ దానం ఒక కీలకమైన వైద్య అవసరంగా మారింది. వేలాది మంది రోగులు ప్రాణాలను రక్షించేందుకు అవయవాల మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. వైద్య శాస్త్రంలో పురోగతి ఉన్నప్పటికీ, మరణానంతరం అవయవాలను దానం చేయాలనే అవగాహన, సంసిద్ధత తక్కువగానే ఉంది. నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం, అవయవ దానం ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించడానికి ప్రణాళికలు వేస్తోంది.

ఇవి కూడా చదవండి

‘‘ప్రజలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది. అందుకు ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగబోయే మూడో వన్డే సందర్భంగా ‘అవయవాలను దానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు గర్వకారణం. అవయవ దానం విషయంలో ముందడుగు వేయాలని.. ప్రజలను చైతన్యపరచాలని అనుకుంటున్నాం. ప్రపంచంలో ఇతరులకు వారి జీవితాన్నే బహుమతిగా ఇవ్వడం కన్నా మరొకటి ఉండదు’’ అని జైషా పేర్కొన్నారు.

వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..

కటక్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, సిరీస్‌ను 2-0తో భారత జట్టు కైవసం చేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ 90 బంతుల్లో 12 బౌండరీలు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేసి ఆతిథ్య జట్టును సునాయాస విజయానికి నడిపించాడు. శుభ్‌మాన్ గిల్ 60 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 41* పరుగులు చేసి 33 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..