
Indian Cricket Team: వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి షురూ కానుంది. అదే సమయంలో, ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23న మొదలై, అక్టోబర్ 8న ముగుస్తాయి. ఇటువంటి పరిస్థితిలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆసియా క్రీడలకు భారత B జట్టును పంపాలని నిర్ణయించింది. ఈ ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును అర్థరాత్రి ప్రకటించింది. అలాగే 5గురు ఆటగాళ్లను స్టాండ్‌బైగా పంపనుంది. ఆసియా గేమ్స్ 2023లో పాల్గొనే జట్టుకు యువ బ్యాట్స్‌మెన్ రితురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే సమయంలో భారత్ తరపున మూడు ఫార్మాట్లలో ఆడిన యంగ్ ప్లేయర్‌కి మాత్రం హ్యాండిచ్చారు.
ఆసియా క్రీడల కోసం చాలా మంది యువ ఆటగాళ్లకు ముఖ్యంగా ఐపీఎల్ బ్యాచ్‌పైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా ఈ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. రెండేళ్లుగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకోని పృథ్వీ షా.. తాజాగా భారత బి టీమ్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. పృథ్వీ తన ఏకైక, చివరి టీ20 మ్యాచ్‌ని 2021 జులైలో శ్రీలంకతో భారత్ తరపున ఆడాడు.
టీమిండియా తరపున 3 ఫార్మాట్లలోనూ మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ.. తాజాగా దులీప్ ట్రోఫీ ఫైనల్-2023లో హాఫ్ సెంచరీ సాధించాడు. దీని కారణంగా, అతను టీమిండియాకు తిరిగి వస్తాడనే ఆశను అభిమానులలో పెంచాడు. కానీ అది జరగలేదు. ఈ దేశవాళీ క్రికెట్ టోర్నీ టైటిల్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ తరపున పృథ్వీ అద్భుత అర్ధ సెంచరీ సాధించాడు. 101 బంతులు ఎదుర్కొని 9 ఫోర్ల సాయంతో 65 పరుగులు జోడించాడు. సెంచరీ పూర్తి చేయలేకపోయాడు.
ఐపీఎల్ 2023లో పృథ్వీ షా పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ 13 సగటుతో 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేట్ కూడా 125గా నిలిచింది. అదే సమయంలో, పృథ్వీ షా ఇప్పటి వరకు టీమిండియా తరుపున 5 టెస్టు మ్యాచ్‌ల్లో 339 పరుగులు, 6 వన్డేల్లో 189 పరుగులు చేశాడు.
రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్)వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్, షాబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే.
స్టాండ్‌బై ప్లేయర్స్: సాయి సుదర్శన్, సాయి కిషోర్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, యశ్ ఠాకూర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..