4 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు.. ఆసియా గేమ్స్‌లో సారథి అన్నారు.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్‌ హింటిచ్చిన బీసీసీఐ..

Team India, ODI World Cup 2023: ధావన్‌కు కనీసం జట్టులో కూడా చోటు కల్పించలేదు. దీంతో టీమ్ ఇండియాలో ధావన్ వయసు అయిపోయిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Venkata Chari

|

Updated on: Jul 15, 2023 | 5:15 PM

Shikhar Dhawan Career: చైనాలో జరగనున్న ఆసియా గేమ్స్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టు ఆసియా క్రీడల్లో ఆడటం ఇదే తొలిసారి. యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో.. ఊహించినట్లుగానే యువ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది.

1 / 9
అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పేరు లేకపోవడం గమనార్హం. ఆసియా క్రీడలకు ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి.

2 / 9
కానీ, సెలక్షన్ బోర్డు అన్ని నివేదికలను తిరస్కరించింది. ధావన్‌కు కనీసం కెప్టెన్సీని కూడా ఇవ్వలేదు. దీంతో టీమిండియాలో ధావన్ శకం ముగిసిందా అనే ప్రశ్న తలెత్తింది.

3 / 9
సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో జట్టును ఇతర సిరీస్‌లకు ఎంపిక చేసే సమయంలో.. శిఖర్ ధావన్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇచ్చిన బాధ్యతను ధావన్ కూడా చక్కగా నిర్వహించాడు. దీంతో ఆసియా క్రీడల్లోనూ ధావన్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడన్న ఆశలు అభిమానుల్లో చిగురించాయి.

4 / 9
కానీ, సెలక్షన్ బోర్డు ధావన్‌ను పట్టించుకోకపోవడంతో ధావన్ కెరీర్‌కు స్వస్తి చెప్పేందుకు సిద్ధమయ్యాడా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ధావన్‌ను ఎంపిక చేయకపోవడానికి అనేక కోణాలు ఉన్నాయని, ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ధావన్‌కు విశ్రాంతినిచ్చారని వినికిడి.

5 / 9
అంటే ప్రపంచకప్‌నకు ధావన్‌ను బ్యాకప్ స్టార్టర్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. రోహిత్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. అయితే బీసీసీఐ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఈ ఇద్దరితో పాటు ధావన్ కూడా ఎంపిక అయ్యే అవకాశాలున్నాయి.

6 / 9
అయితే, ధావన్‌ను ఆసియా క్రీడలకు ఎంపిక చేయకపోవడం మరో కోణానికి తెరతీసింది. ధావన్ కెరీర్ ముగిసిపోయిందని సెలక్టర్లు సంకేతాలిస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

7 / 9
10 డిసెంబర్ 2022న టీమిండియా తరపున తన చివరి మ్యాచ్ ఆడిన ధావన్ అప్పటి నుంచి జట్టుకు దూరమయ్యాడు. ధావన్ గురించి సెలక్టర్లు ఏమనుకుంటున్నారో వన్డే ప్రపంచకప్ జట్టును ప్రకటించినప్పుడే తెలుస్తుంది.

8 / 9
ధావన్ పేరు జట్టులో కనిపిస్తే అతని కెరీర్ కొనసాగుతుంది. ధావన్ పేరు కనిపించకపోతే సెలక్టర్లు పెద్దగా అవకాశం ఇచ్చే ఆలోచనలో లేరనేది నిర్ధారణ అవుతుంది.

9 / 9
Follow us