Joginder Sharma: 2007 టీ20 ప్రపంచకప్ (2007 T20 World Cup)ను ఎవరు మర్చిపోగలరు? మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నాయకత్వంలోని భారత యువ జట్టు T20 ప్రపంచ కప్ రంగంలోకి ప్రవేశించడమేకాకుండా.. ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టును ఓడించి మొదటి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీని గెలిపించడంలో, ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించడంలో జట్టులోని యువ ఆటగాళ్ల కృషి ఎంతో ఉంది. అలాంటి యువ ఆటగాళ్లలో ఫైనల్ మ్యాచ్ 20వ ఓవర్ వేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించిన జోగిందర్ శర్మ ఒకరు. ప్రస్తుతం హర్యానా పోలీస్‌లో డీఎస్పీగా ఉన్న జోగిందర్ శర్మ(Joginder Sharma)పై గతంలో ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు వినిపించాయి.
టీ20 వరల్డ్ కప్ 2007లో పాకిస్థాన్‌తో జరిగిన చివరి ఓవర్ మ్యాచ్‌లో జోగిందర్ శర్మ మిస్బా ఉల్ హక్ వికెట్ తీసి టీమ్ ఇండియాను గెలిపించడం అభిమానులందరికీ ఇప్పటికీ గుర్తుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఈ స్టార్ ప్లేయర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం జోగిందర్ శర్మ హర్యానా పోలీస్‌లో డీఎస్పీగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మహత్య కేసులో అతనిపై కేసు నమోదైంది. ఈ కేసులో అతనితో పాటు మరో 6 మంది పేర్లు కూడా వినిపించాయి.
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం హర్యానా పోలీస్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న జోంఘిదర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదైంది. హిస్సార్ జిల్లాలోని దబ్డా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు జోగిందర్‌పై ఆరోపణలు వచ్చాయి. సమాచారం ప్రకారం, జనవరి 1 న, హిస్సార్ జిల్లాలోని దబ్డా గ్రామానికి చెందిన నివాసి ఆస్తి వివాదంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత, మృతుడి కుటుంబ సభ్యులు జోగిందర్ శర్మ పేరుతో సహా 7 మంది నిందితులపై కేసు పెట్టారు.
హర్యానా పోలీసులు జోగిందర్ శర్మతో పాటు మరో ఆరుగురిపై హిసార్‌లోని ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ-ఎస్టీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితులందరూ గతంలో కూడా తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేశారని మృతురాలి తల్లి ఆరోపించింది. ప్రస్తుతం నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరోసారి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..