World Record: 48 ఫోర్లు, 24 సిక్సర్లు.. వన్డేల్లో ఏకంగా 407 పరుగులు.. రోహిత్ రికార్డు బ్రేక్..

ఫోర్ల జోరు.. సిక్సర్ల హోరు.. వన్డేల్లో మరో సంచలన రికార్డు నమోదైంది. అండర్-16 టోర్నీలో ఓ యువ ఆటగాడు..

World Record: 48 ఫోర్లు, 24 సిక్సర్లు.. వన్డేల్లో ఏకంగా 407 పరుగులు.. రోహిత్ రికార్డు బ్రేక్..
Cricket

Updated on: Nov 14, 2022 | 12:27 PM

ఫోర్ల జోరు.. సిక్సర్ల హోరు.. వన్డేల్లో మరో సంచలన రికార్డు నమోదైంది. అండర్-16 టోర్నీలో ఓ యువ ఆటగాడు ఏకంగా క్వాడ్రాపుల్‌ సెంచరీ(400) బాదేశాడు. లిస్టు-ఏ క్రికెట్‌లో చోటు చేసుకున్న ఈ ఘనతతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టాడు. ఇటీవల కర్ణాటకలోని షిమోగలో జరిగిన అంతర్ జిల్లా అండర్-16 టోర్నీలో భాగంగా భద్రావతి-సాగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తన్మయ్ మంజునాధ్ 165 బంతుల్లో 48 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 407 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మంజునాధ్ సాగర్ టీం తరపున బరిలోకి దిగాడు. అతడి ఇన్నింగ్స్‌తో సాగర్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 583 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన భద్రావతి టీమ్‌ కేవలం 73 పరుగులకే కుప్పకూలి.. ఘోర ఓటమిని చవి చూసింది. కాగా, ఈ మ్యాచ్‌లో 400 పరుగులు చేసిన తన్మయ్‌.. వన్డేల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్. లిస్టు-ఏ క్రికెట్ కూడా కలుపుకుంటే.. ఏడీ బ్రౌన్ 268 పరుగులు సాధించాడు. ఇప్పుడు వీరిద్దరి రికార్డు బద్దలు కొట్టి.. తన్మయ్‌ 400 పరుగులతో చెలరేగిపోయాడు.