T20 Record : ఇదేం మ్యాచ్ రా నాయనా.. 10 మంది డకౌట్.. 4 పరుగులకే ఆలౌట్, 2 బంతుల్లోనే మ్యాచ్ గెలిచారు

క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టడం, చిన్న స్కోరుకే ఆలౌట్ అవ్వడం సాధారణమే. కానీ, రాజస్థాన్‌లో జరిగిన ఒక మహిళల టీ20 మ్యాచ్‌లో ఇంతవరకు ఎవరూ చూడని ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. ఒక జట్టులోని 10 మంది బ్యాట్స్‌మెన్‌లు సున్నా పరుగులకే అవుట్ కావడం, ఆ జట్టు మొత్తం 4 పరుగులకే ఆలౌట్ అయింది.

T20 Record : ఇదేం మ్యాచ్ రా నాయనా..  10 మంది  డకౌట్.. 4 పరుగులకే ఆలౌట్, 2 బంతుల్లోనే మ్యాచ్ గెలిచారు
T20 Record

Updated on: Aug 12, 2025 | 2:50 PM

T20 Record : క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టడం, తక్కువ స్కోరుకే ఆలౌట్ అవ్వడం సాధారణమే. అసలు టీ20 క్రికెట్ అంటేనే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, భారీ స్కోర్లు, సిక్సర్ల వర్షం. కానీ, కొన్నిసార్లు క్రికెట్ అనూహ్యమైన పరిస్థితులను సృష్టిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్‌లో జరిగిన ఒక మహిళల టీ20 మ్యాచ్‌లో ఇంతవరకు ఎవరూ చూడని ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. ఒక జట్టులోని 10 మంది బ్యాట్స్‌మెన్‌లు డకౌట్ కావడం, ఆ జట్టు మొత్తం 4 పరుగులకే ఆలౌట్ అవడం, ప్రత్యర్థి జట్టు కేవలం రెండు బంతుల్లోనే మ్యాచ్ గెలుచుకోవడం జరిగింది. ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక వింతైన రికార్డు. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ మహిళల టీ20 టోర్నమెంట్ నిర్వహించింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సికర్, సిరోహి జిల్లాల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సిరోహి జట్టు బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. 9వ స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మెన్ మాత్రమే 2 పరుగులు చేశాడు. మిగిలిన 10 మంది బ్యాట్స్‌మెన్‌లు ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ అయ్యారు. ఎక్స్‌ట్రాల ద్వారా మరో 2 పరుగులు రావడంతో, సిరోహి జట్టు మొత్తం స్కోరు కేవలం 4 పరుగులకు ఆలౌట్ అయింది.

సిరోహి జట్టు ఇచ్చిన 5 పరుగుల లక్ష్యం సికర్ జట్టుకు చాలా సులువుగా మారింది. సికర్ జట్టు ఓపెనర్లు కేవలం 2 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఇలా కేవలం 2 బంతుల్లో మ్యాచ్ గెలిచి, 10 వికెట్ల తేడాతో సికర్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ రికార్డు పురుషుల క్రికెట్‌లో ఇప్పటివరకు జరగలేదు. ఈ మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక విచిత్రమైన, మరచిపోలేని సంఘటనగా నిలిచిపోయింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..