CWG 2022 Day 4, Schedule: వెయిట్ లిఫ్టింగ్‌లో మరిన్ని పతకాలు.. 4వ రోజు షెడ్యూల్ ఎలా ఉందంటే?

|

Jul 31, 2022 | 10:44 PM

వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు సహా మొత్తం 5 పతకాలు సాధించింది. ఈ గేమ్‌లో మరిన్ని పతకాలు రావాల్సి ఉంది. పురుషుల 81 కిలోల విభాగంలో..

CWG 2022 Day 4, Schedule: వెయిట్ లిఫ్టింగ్‌లో మరిన్ని పతకాలు.. 4వ రోజు షెడ్యూల్ ఎలా ఉందంటే?
Cwg 2022 Day 4, Schedule
Follow us on

కామన్వెల్త్ గేమ్స్ 2022 నాల్గవ రోజున వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌ మరిన్ని పతకాలను ఆశించే ఛాన్స్ ఉంది. జూడో, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్‌లో కూడా భారత ఆటగాళ్లు పతకానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో బ్యాడ్మింటన్‌లో పతకం ఖాయం చేసేందుకు భారత జట్టు దిగనుంది. అయితే అంతకు ముందు క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో రోజైన సోమవారం అంటే సోమవారం భారత పురుషుల టేబుల్ టెన్నిస్ పతకం ఖాయం కానుంది. భారత జట్టు సెమీఫైనల్ మ్యాచ్ సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల మధ్య జరగనుంది.

బ్యాడ్మింటన్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్ ఉదయం 11 గంటల నుంచి జరుగుతుంది. అయితే ముందుగా భారత్ క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది.

వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు సహా మొత్తం 5 పతకాలు సాధించింది. ఈ గేమ్‌లో మరిన్ని పతకాలు రావాల్సి ఉంది. పురుషుల 81 కిలోల విభాగంలో అజయ్ సింగ్ మధ్యాహ్నం 2 గంటలకు, మహిళల 71 కిలోల విభాగంలో హర్జిందర్ కౌర్ రాత్రి 11 గంటలకు బరిలోకి దిగనున్నారు.

ఇవి కూడా చదవండి

నాలుగో రోజు సాయంత్రం 6.30 గంటలకు ఇంగ్లండ్‌తో భారత పురుషుల హాకీ జట్టు మైదానంలోకి దిగనుంది.

స్క్వాష్‌లో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య జరిగే మహిళల సింగిల్స్ ప్లేట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సారా కురువిల్లా ప్రవేశించనుంది. జోష్నా చినప్ప మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో హోలీతో క్వార్టర్ ఫైనల్స్ ఆడేందుకు దిగుతుంది.

భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘల్ 48 కిలోల వెయిట్ కేటగిరీ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య మ్యాచ్ జరగనుంది. మరోవైపు సుమిత్ కుందు ప్రీక్వార్టర్‌ఫైనల్‌లో అడుగుపెట్టనున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరిగే జూడోలో పురుషుల 60 కేజీల్లో విజయ్‌ కుమార్‌, 66 కేజీల్లో జస్లీన్‌ సింగ్‌, మహిళల 48 కేజీల్లో సుశీల, 57 కేజీల్లో సుచిక సవాల్‌ విసిరారు. పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లైలో సజన్ ప్రకాష్, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో సుయాష్ జాదవన్, నిరంజన్ ముకుందన్ సవాల్ చేయనున్నారు.