CWG 2022 IND vs AUS: పోరాడి ఓడిన భారత్… మహిళల టీ20లో రజత పతకం
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల క్రికెట్‌లో తొలి ఛాంపియన్‌గా ఎంపికైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీ20 ప్రపంచ చాంపియన్‌లో ఆస్ట్రేలియా..
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల క్రికెట్‌లో తొలి ఛాంపియన్‌గా ఎంపికైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీ20 ప్రపంచ చాంపియన్‌లో ఆస్ట్రేలియా మహిళల జటటు 9 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. టీ20 ఫైనల్లో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత జట్టు.. రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా స్కోర్ 161/8 కాగా, భారత్ 152 స్కోర్‌తో అలౌట్ అయ్యింది. భారత్ ఖాతాలో 18 స్వర్ణాలు, 13 రతాలు, 21క్యాంసాలు చేరాయి.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత జట్టు స్వర్ణం సాధించాలన్న కల చెదిరిపోయి రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి