CWG 2022: బాక్సింగ్ నుంచి బ్యాడ్మింటన్ వరకు.. మరో 8 స్వర్ణాలపై కన్నేసిన భారత్.. పూర్తి జాబితా ఇదే..

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 17 స్వర్ణ పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ మూడో స్థానానికి చేరుకోవాలంటే కనీసం 7-8 బంగారు పతకాలు సాధించాల్సి ఉంది.

CWG 2022: బాక్సింగ్ నుంచి బ్యాడ్మింటన్ వరకు.. మరో 8 స్వర్ణాలపై కన్నేసిన భారత్.. పూర్తి జాబితా ఇదే..
Cwg 2022
Follow us

|

Updated on: Aug 07, 2022 | 8:12 PM

కామన్వెల్త్ గేమ్స్ 2022 రేపటితో ముగియనున్నాయి. ఈ క్రీడలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో భారత్ పతకాల సంఖ్య కూడా పెరుగుతోంది. భారత్ ఇప్పటి వరకు మొత్తం 17 బంగారు పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. గేమ్స్‌లో ఇంకా కొన్ని ఈవెంట్‌లు మిగిలి ఉన్నాయి. అందులో భారత్‌కు బంగారు పతకం సాధించే అవకాశం ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం..

8 స్వర్ణ పతకాలపై కన్నేసిన భారత్..

  1. బాక్సింగ్ : CWG 2022లో ఈసారి భారత బాక్సర్లు బాగా రాణించారు. బంగారంతో సహా అనేక పతకాలు సాధించారు. ఆదివారం, ఆగస్టు 7న నీతూ, నిఖత్ జరీన్, అమిత్ పంఘల్ బాక్సింగ్‌లో దేశం తరపున బంగారు పతకాలు సాధించారు. వీరిద్దరూ కాకుండా, ఆదివారం రాత్రి సూపర్ హెవీవెయిట్ విభాగంలో ఫైనల్స్‌లోకి ప్రవేశించనున్న సాగర్‌పై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.
  2. టేబుల్ టెన్నిస్ : టీటీ తొలినాళ్లలో పురుషుల టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. కాగా, ఆదివారం అర్థరాత్రి, ఆచంట శరత్ కమల్, శ్రీజ ఆకుల మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్స్‌లో స్వర్ణం గెలిచేందుకు బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు, శరత్ కమల్, సత్యన్ ఆదివారం పురుషుల సింగిల్స్‌లో తమ సెమీ-ఫైనల్‌లను ఆడనున్నారు. ఇద్దరూ ఫైనల్‌కు చేరుకుంటారని భావిస్తున్నారు.
  3. క్రికెట్: భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా మహిళల క్రికెట్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. భారత జట్టు ఇప్పుడు స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటోంది. అయితే, ఆస్ట్రేలియా రూపంలో అత్యంత కఠినమైన సవాలు ఉంది. అయినప్పటికీ, భారత జట్టు స్వర్ణంపై ఆశలు పెట్టుకుంది.
  4. బ్యాడ్మింటన్ : బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు స్వర్ణం గెలిచే అవకాశాలు ఉన్నాయి. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టి జోడీ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ మూడు ఫైనల్‌లు ఆగస్టు 8 సోమవారం జరుగుతాయి. ఈ మూడింటిలోనూ భారత్ స్వర్ణాలు సాధిస్తుందని భావిస్తున్నారు.
  5. హాకీ : పురుషుల హాకీలో భారత్‌కు భారీ ఆశలు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ప్రస్తుతం టీమిండియాకు అతిపెద్ద సమస్య ఆస్ట్రేలియా రూపంలో నిలవనుంది. CWGలో మొత్తం 6 స్వర్ణాలు గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అంత సులభం కాదు. అయితే ఇటీవల భారత జట్టు మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. దీంతో ఫైనల్ గెలిచి స్వర్ణం సాధిస్తుందని భావిస్తున్నారు.