CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 మూడవ రోజున అనేక మ్యాచ్‌లు జరుగుతున్నాయి . ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రత్యర్థి జట్టు కోచ్ తన బూట్లు తీసి ఆటగాడికి ఇచ్చిన సీన్, అందర్నీ ఆకట్టుకుంటుంది. దీని వీడియోను కామన్వెల్త్ ట్వీట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, నెటిజన్లకు విపరీతంగా నచ్చింది. ఈ మ్యాచ్ మలేషియా, జమైకా మధ్య జరిగింది.
ఈవెంట్‌లో రెండవ రోజు మలేషియా, జమైకా మధ్య బ్యాడ్మింటన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జమైకా అత్యుత్తమ ఆటగాడు శామ్యూల్ రికెట్స్ బూట్లు చిరిగిపోయాయి. దీంతో కొంత సేపు ఆట నిలిచిపోయింది. మలేషియా కోచ్ హెండ్రూవాన్ ఈ దృశ్యాన్ని చూస్తూ రికెట్స్ దగ్గరకు చేరుకున్నాడు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ షూస్ తీసి ఆయనకు ఇచ్చాడు.
When the opposition coach is your shoe size and saves the day ?
It’s what the Games is all about!#B2022 #CommonwealthGames #Badminton pic.twitter.com/wnJcJ7uNKW
— Commonwealth Sport (@thecgf) July 30, 2022
కోచ్ హెంద్రేవన్ సెంటిమెంట్‌ని చూసి స్టాండ్‌లో కూర్చున్న ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనికి జమైకా ప్లేయర్ రికెట్స్ కూడా కోచ్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో రికెట్స్ ఓడిపోయాడు. ఈ బ్యాడ్మింటన్ డబుల్స్ మ్యాచ్‌లో రికెట్స్ 21-7, 21-11తో తన భాగస్వామి జోయెల్ అంగస్ చేతిలో ఓడిపోయాడు.