India vs England: టీమ్ ఇండియాకు షాక్.. గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమైన అక్షర్ పటేల్
Axar Patel Misses India v England: ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంలో
Axar Patel Misses India v England: ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంలో ఇంగ్లండ్‌తో తలపడేందుకు సన్నద్ధమవుతోంది. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో పర్యాటక జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ప్రారంభానికి ముందే భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టు టాస్ ప్రారంభానికి ముందే స్పిన్నర్ అక్షర్ పటేల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడు తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేసింది. అక్షర్ స్థానంలో షాబాజ్ నదీమ్, రాహుల్ చాహర్‌లను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక మరికాసేపట్లో చెన్నైలో టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.
ఆదిలాబాద్‌లో మహిళా వేధింపులకు బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..