Serena One-Legged Catsuit : అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆటతోనే కాదు మంచి ఫాషన్ డిజైనర్ గా కూడా ప్రసిద్ధి.. ఇక తన ఆటతోపాటు.. డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ 2021 సిరీస్ లో సెరెనా కొత్త క్యాస్టూమ్స్ తో బరిలోకి దిగింది. టోర్నీ లో శుభారంభం చేసింది.
తన కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన 39 ఏళ్ల సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కొత్త కాస్ట్యూమ్‌తో తళుక్కుమంది. ‘వన్ లెగ్ క్యాట్‌సూట్’ను ధరించి బరిలోకి దిగింది. తను ఇలా డ్రెస్ ధరించడానికి కారణం అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్‌నర్ స్మారకార్థంఅని చెప్పింది సెరెనా.‘ఫ్లో జో’గా పేరున్న ఫ్లోరెన్స్ 1988లో మహిళల 100, 200 మీటర్ల విభాగాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.
ఇక సోమవారం జరిగిన మహిళా సింగిల్స్ తొలి రౌండ్ లో పదో ర్యాంకర్ సెరెనా వరస సెట్లల్లో జర్మనీ కి చెందిన లౌరా సిగేమండ్ పై గెలిచింది. తన పదునైన ఏస్‌లతో 6-1,6-1 తో లౌరా సిగేమండ్ ను ఓడించి రెండో రౌండ్ లో అడుగు పెట్టింది. 56 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
Also Read: