Virat Kohli: విరాట్‌కి కలిసి రాని 23వ తేదీ.. ఇదే రోజు వరుసగా 3సార్లు గోల్డెన్‌ డక్‌..

|

Apr 24, 2023 | 7:17 AM

విరాట్‌ కోహ్లీకి 23వ తేదీ కలిసి రావడం లేదా? ఆర్సీబీకి స్టాండిన్‌ కెప్టెన్‌కి 23 గండం ఉందా? మూడుసార్లు 23న గోల్డెన్‌ డక్‌ అవడానికి అదే కారణమా? అంటే.. గతాన్ని చూస్తుంటే అవుననే చెబుతోంది. ఏప్రిల్‌ 23.. ఆర్‌సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఏ మాత్రం కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ తేదీన ఆర్‌సీబీ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం గమనార్హం.

Virat Kohli: విరాట్‌కి కలిసి రాని 23వ తేదీ.. ఇదే రోజు వరుసగా 3సార్లు గోల్డెన్‌ డక్‌..
Virat Kohli
Follow us on

విరాట్‌ కోహ్లీకి 23వ తేదీ కలిసి రావడం లేదా? ఆర్సీబీకి స్టాండిన్‌ కెప్టెన్‌కి 23 గండం ఉందా? మూడుసార్లు 23న గోల్డెన్‌ డక్‌ అవడానికి అదే కారణమా? అంటే.. గతాన్ని చూస్తుంటే అవుననే చెబుతోంది. ఏప్రిల్‌ 23.. ఆర్‌సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఏ మాత్రం కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ తేదీన ఆర్‌సీబీ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం గమనార్హం. ఏప్రిల్‌ 23న కోహ్లి గోల్డెన్‌ డక్‌ అయిన రెండు సందర్భా‍ల్లో ఆర్‌సీబీకి ఓటములే ఎదురయ్యాయి.

ఏప్రిల్‌ 23, 2017న ఆర్‌సీబీ వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చి తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. నాథన్‌ కౌల్టర్‌ నీల్‌ బౌలింగ్‌లో మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ 82 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇక ఏప్రిల్‌ 23, 2022న ఆర్‌సీబీ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన కోహ్లి మరోసారి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇక ఏప్రిల్‌ 23,2023న రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి మరోసారి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి బౌల్ట్‌ వేసిన తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే యాదృచ్ఛికంగా ఏప్రిల్ 23న జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లీ మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం చర్చనీయాంశం అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..