Gold Loans: మీ బంగారానికి ముత్తూట్‌ ఫైనాన్స్‌ భరోసా.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఈజీ లోన్స్‌..

| Edited By: శివలీల గోపి తుల్వా

Jan 30, 2023 | 10:15 PM

బంగారాన్ని, భారతీయులను విడదీయలేం. అంతలా బంగారం మన జీవితాల్లో భాగమైపోయింది. బంగారం కేవలం అలకంరణ వస్తువుగానే కాకుండా ఆర్థికంగానూ భద్రతను ఇస్తుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడి మార్గంగా అనుసరిస్తున్నారు. డబ్బును బంగారం రూపంలో దాచుకోవడం..

Gold Loans: మీ బంగారానికి ముత్తూట్‌ ఫైనాన్స్‌ భరోసా.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఈజీ లోన్స్‌..
Follow us on

బంగారాన్ని, భారతీయులను విడదీయలేం. అంతలా బంగారం మన జీవితాల్లో భాగమైపోయింది. బంగారం కేవలం అలకంరణ వస్తువుగానే కాకుండా ఆర్థికంగానూ భద్రతను ఇస్తుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడి మార్గంగా అనుసరిస్తున్నారు. డబ్బును బంగారం రూపంలో దాచుకోవడం ద్వారా భవిష్యుత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. చేతిలో డబ్బులు లేని సమయంలో బంగారం మంచి వనరుగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితులు వస్తే బంగారాన్ని డబ్బుగా మార్చుకోవడం కూడా చాలా సులభం. అందుకే బంగారంలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు.

బంగారం చేతిలో ఉంటే లోన్‌ పొందడం కూడా చాలా సులభం. తక్కువ వడ్డీకే బంగారంపై రుణాన్ని పొందొచ్చు. సిబిల్‌ స్కోర్‌తో సంబంధం లేకుండా క్షణాల్లో రుణాన్ని పొందగలగడం గోల్డ్‌ లోన్‌ వల్ల కలిగే బెనిఫిట్‌. గోల్డ్‌ లోన్‌ తీసుకునే విషయంలో నమ్మకమే కీలక పాత్ర పోషిస్తుంది. గోల్డ్‌ లోన్‌ విషయానికొస్తే ముత్తూట్‌ ఫైనాన్స్‌ దేశంలోనే అతిపెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల్లో ఒకటి. ముత్తూట్‌ ఫైనాన్స్‌ ద్వారా ప్రతిరోజూ 2.5 లక్షల మంది కస్టమర్స్‌ సేవలు పొందుతున్నారు. 135 ఏళ్ల నుంచి ముత్తూట్ ఫైనాన్స్‌ సేవలు అందిస్తోంది. రుణం పొందడానికి పలు రకాల మార్గాలున్నా గోల్డ్‌ లోన్స్‌ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తుంది. అలాగే కస్టమర్ల బంగారానికి బీమా సౌకర్యంతో పాటు, ఏడు దశల్లో మీ గోల్డ్‌కి రక్షణ కల్పిస్తుంది.

ఇక గోల్డ్‌ లోన్‌లను కసమర్లకు మరింత చేరువ చేయడానికి ముత్తూట్‌ ఫైనాన్స్‌ ప్రత్యేకంగా యాప్‌ను సైతం తీసుకొచ్చింది. ఇందుకోసం Loan@home అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీ మొబైల్‌ నెంబర్‌ నుంచి 18002021212 నెంబర్‌కి కాల్‌ చేస్తే ముతూట్‌ ఫైనాన్స్‌ ప్రతినిధులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి మీ బంగారానికి ఎంత రుణం వస్తుందో చెబుతారు. ఒక్కసారి లోన్‌ ప్రాసెస్‌ పూర్తికాగానే రుణ మొత్తం నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఇదంతా ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఇంటి వద్ద సేవలు అందించే క్రమంలో భద్రత విషయంలోనూ ముత్తూట్‌ ఫైనాన్స్‌ పటిష్ట చర్యలు తీసుకుంది. ఉద్యోగులను కాంట్రాక్ట్‌ విధానంలో కాకుండా రెగ్యులర్‌ బేసిస్‌లోనే తీసుకుంటుంది.

Muthoot Finance

ముత్తూట్‌ ఫైనాన్స్‌ ‘గోల్డ్‌ మిల్లిగ్రామ్‌ రివార్డ్‌’ పేరుతో కస్టమర్‌ రివార్డ్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ముత్తూట్‌ గ్రూప్‌లో లావాదేవీలు, ఇతరులకు రిఫర్‌ చేయడం ద్వారా 24 క్యారెట్ల గోల్డ్‌ కాయిన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఐముతూట్‌ అప్లికేషన్‌ ద్వారా బ్రాంచ్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే రుణం పొందే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ గోల్డ్‌ లోన్‌ టాప్‌ అప్ ఆప్షన్‌ను సైతం అందించారు. ఈ కారణాల వల్ల ముతూట్ ఫైనాన్స్‌లో మీ బంగారానికి సరైన భద్రతతోపాటు తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..