స్టాక్ మార్కెట్‌లో చౌక ధరకు షేర్లను కొని, వాటిని ఖరీదైన ధరకు అమ్మి లాభాలు ఆర్జించడం మనకు తెలుసు. అదే స్టాక్ మార్కెట్‌లో ఖరీదైన ధరకు షేర్లను విక్రయించి, తర్వాత కొనుగోలు చేయడం ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. ఇది కొత్తగా అనిపించినా వాస్తవం. షేర్ మార్కెట్‌లో క్రయ, విక్రయాలు బుల్లిష్, బేరిష్ అనే సెంటిమెంట్స్ పై ఆధారపడి ఉంటుంది. మీరు కంపెనీ షేర్లను కొనుగోలు చేసి, ధర పెరుగుతుందని ఆశించినట్లయితే, దానిని లాంగ్ లేదా లాంగ్ పొజిషన్ అంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో షేర్ ధర పడిపోతుందని భావించి, దానిని మీ పేరుకు బదిలీ చేయకముందే విక్రయించినట్లయితే, దానిని షార్ట్ పొజిషన్ అంటారు. మీరు లాంగ్, షార్ట్ పొజిషన్ల గురించి మరింత అవగాహన పెంచుకోవడానికి 5పైసా వెబ్ సైట్ కు సంబంధించిన ఈ లింక్ పై https://bit.ly/3RreGqO క్లిక్ చేయవచ్చు.
లాంగ్ పొజిషన్ :మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ ఉంటే, షేర్ ధర పెరుగుతుందని ట్రేడర్ భావిస్తే, అతడు ఆషేర్ ను ఎక్కువ కాలం విక్రయించకుండా ఉంచుకోవచ్చు. తరువాత, ధర పెరిగినప్పుడు, అతను షేర్లను విక్రయించడం ద్వారా లాభం పొందవచ్చు. ఉదాహరణకు, ABC కంపెనీ షేర్ విలువ రూ.100. కాలక్రమేణా అది రూ.120కి పెరుగుతుందని షేర్ కొన్న వ్యక్తి భావిస్తే, షేర్ ను రూ.100కి కొనుగోలు చేసి.. రూ.120కి చేరుకున్న తర్వాత విక్రయించడం ద్వారా ట్రేడర్ లాభం పొందుతాడు. భవిష్యత్తులో ధర పెరుగుతుందని అంచనా వేసి.. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని షేర్లపై పెట్టుబడి పెడతారు. దీనినే లాంగ్ పొజిషన్ అంటారు.
షార్ట్ పొజిషన్: సాధారణంగా ట్రేడింగ్‌లో ఏదైనా షేర్ ను విక్రయించే ముందు కొనుగోలు చేయాలి. కానీ స్టాక్ మార్కెట్‌లో అలా కాదు.. వాస్తవానికి, పెట్టుబడిదారుడు షేర్ విలువ తక్కువ ధరలో ఉన్నప్పుడు, మార్కెట్ ధరకు బ్రోకర్ నుండి షేర్లను తీసుకుంటాడు. ఆసమయంలో ఆషేర్లను విక్రయిస్తారు. తరువాత అదే షేరును బ్రోకర్‌కు తిరిగి ఇస్తాడు. షేర్ విలువ పడిపోయినప్పుడు, తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా లాభం పొందవచ్చని ట్రేడర్ భావించడం వల్ల ఇది జరుగుతుంది. షేర్ మార్కెట్ కు సంబంధించి లాంగ్, షార్ట్ పొజిషన్ల గురించి మరిన్ని వివరాల కోసం 5పైసా డాట్ కామ్ వెబ్ సైట్ ను సందర్శించండి.
పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.