AirAsia: పర్యాటకులకు ఎయిర్ ఏషియా గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి సెబు ద్వీపానికి కనెక్టివిటీ..

అందరికీ విమాన ప్రయాణాన్ని సాధ్యం చేయాలన్న ఆకాంక్షతో ఏర్పడిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా (ఎకె).. ప్రయాణికులకు అందుబాటులో.. అతి తక్కువ ధరలతో.. ప్రపంచ వ్యాప్తంగా పలు గమ్యస్థానాలకు కనెక్టివిటీని కలిగి ఉంది.. మలేషియా కౌలాలంపూర్ కేంద్రంగా.. అంతర్జాతీయంగా ఎన్నో ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీని అందిస్తున్న ఎయిర్ ఏషియా.. తాజాగా కీలక ప్రకటన చేసింది.

AirAsia: పర్యాటకులకు ఎయిర్ ఏషియా గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి సెబు ద్వీపానికి కనెక్టివిటీ..
Airasia

Updated on: Sep 11, 2025 | 12:45 PM

మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పింది.. అందరికీ విమాన ప్రయాణాన్ని సాధ్యం చేయాలన్న ఆకాంక్షతో ఏర్పడిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా (ఎకె).. ప్రయాణికులకు అందుబాటులో.. అతి తక్కువ ధరలతో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని నగరాలకు కనెక్టివిటీని కలిగిఉంది.. మలేషియా కౌలాలంపూర్ కేంద్రంగా.. అంతర్జాతీయంగా ఎన్నో ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీని అందిస్తున్న ఎయిర్ ఏషియా.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఎయిర్ ఏషియా ఫిలిప్పీన్స్లోని సెబులో కొత్త హబ్ను ప్రారంభించింది.. ఇప్పుడు కౌలాలంపూర్ ద్వారా సెబు ద్వీపానికి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వొచ్చు.. భారతదేశంలోని ప్రముఖ నగరాలలోని విమానాశ్రయాల నుంచి కౌలాలంపూర్ మీదుగా సెబుకు ప్రయాణించవచ్చు..

పర్యాటక ఐకానిక్ కేంద్రంగా సెబు..

సెబును “క్వీన్ సిటీ ఆఫ్ ద సౌత్” అని పిలుస్తారు.. ఫిలిప్పీన్స్‌లో దాని గొప్ప చరిత్ర, అద్భుతమైన బీచ్‌లు, డైనమిక్ సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన కేంద్రం.. ఫిలిప్పీన్స్‌లోని పురాతన నగరంగా, సెబూ అనేక చారిత్రక మైలురాళ్లను కలిగి ఉంది. అలాగే.. సెబూ ద్వీపం అద్భుతమైన బీచ్‌లకు, బీచ్ రిసార్ట్‌లకు నిలయంగా ఉంది.

ప్రత్యేక ఆకర్షణగా జలపాతాలు, హెరిటేజ్ స్పాట్‌లు..

సెబులో కవాసన్ జలపాతం, మాగెల్లాన్స్ క్రాస్, మలపాస్కువా ద్వీపం పర్యాటకులకు అందమైన అనుభూతిని కలిగిస్తాయి..

అలాగే.. సిరావ్ ఫ్లవర్ గార్డెన్, బోజో నది, కామోట్స్ గుహలు, కార్కార్ హెరిటేజ్ నా భూతో నా భవిష్యత్ అన్నట్లు మధురానుభూతిని కలిగిస్తాయి..

ఫిలిప్పీన్స్‌లోని సెబు ద్వీపం పర్యాటకులకు స్వర్గధామంగా విరాజల్లుతోంది.. కావున.. అందరూ కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేయడానికి ఇదొక అద్భుతమైన టూరిస్ట్ స్పాట్..

ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సెబు ద్వీపానికి డైరెక్ట్ కనెక్టివిటీని అందించేందుకు ఏర్పాట్లు చేసింది.. కౌలాలంపూర్ నుంచి వారానికి 14 సార్లు కనెక్ట్ అవుతోంది. అలాగే.. భారత్‌లోని పలు విమానాశ్రయాల నుంచి కౌలాలంపూర్ మీదుగా ప్రయాణించవచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఈ మేరకు ధరలను కూడా ప్రకటించింది.

ప్రారంభ ఛార్జీలు ఇలా..

అమృత్‌సర్ – INR 19,192

కొల్‌కత్తా – INR 14,277

చెన్నై – INR 17,647

తిరుచ్చి – INR 16,946

హైదరాబాద్ – INR 19,427 గా నిర్ణయించింది..

ఈ టిక్కెట్లు సెప్టెంబర్ 3 నుండి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.. పర్యాటకులు.. AirAsia MOVE, ట్రావెల్ ఏజెంట్ లేదా ఇష్టపడే OTA వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాల కోసం