Astrology Tips for Money: హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేష ప్రాముఖ్యత ఉంది. సిరిసంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని సంకేతాలు వ్యక్తికి కనిపించినా.. అనిపించినా.. వారి జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం. ఇదే విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి లక్ష్మీ దేవి రాక ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఓసారి తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కలలు వస్తాయి. కలలో దేవుడిని చూడటం, కలలో నిధి కనిపించడం, చెట్లు, మొక్కలు, పచ్చదనం కనిపించడం జరుగుతుంది. కలలో ఇవి కనిపిస్తే.. త్వరలోనే మీ జీవితంలో మంచి రోజుల ప్రారంభానికి ప్రతీకగా పేర్కొంటున్నారు జ్యోతిష్య పండితులు.
మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు, మొక్కలు పచ్చగా ఎదుగుతుంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా, అందంగా కనిపిస్తుంటుంది. అదే విధంగా ఇంట్లోని అరటి చెట్లు, మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి. ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొంటున్నారు నిపుణులు.
మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు.. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది. ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు.. వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది.
ఒక వ్యక్తి తన ఇంట్లో నల్ల చీటమ గుంపును చూసినప్పుడు, ఉదయం శంఖం ధ్వనిని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు. ఇవి మీకు కనిపించినట్లయితే.. లక్ష్మీ దేవి మీ పట్ల ప్రసన్నురాలైందని, మీపై దయ చూపిందని అర్థంగా పేర్కొంటున్నారు జ్యోతిష్య పండితులు. అంతేకాదు.. లక్ష్మీ దేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..