కేదార్‌నాథ్ ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను వెంట తీసుకెళ్లి ఆలయంలోని నంది విగ్రహాన్ని తాకుతున్న వీడియో, ఫోటో నెట్టింట వైరల్‌గా మారడంతో వివాదం చెలరేగింది. దీనిపై ఆలయ అర్చకులు అభ్యంతరం తెలిపారు. అర్చకుల నిరసనతో ఆలయ కమిటీ దీనిపై దృష్టి సారించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మే 3 నుంచి ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు దేవుడి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక భక్తుడు తన కుక్కతో కేదార్‌నాథ్ చేరుకున్నాడు. ఆలయం వెలుపల ఆ భక్తుడు తన పెంపుడు కుక్క కాలితో మొదట నందిని తాకి, ఆపై స్వయంగా బూట్లు ధరించి నందిని తాకి మొక్కుతున్నట్టుగా ఉంది..ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యుడిపై చర్యలకు ఆదేశించింది.
గతంలో కేదార్‌నాథ్ ధామ్‌లో ఓ వ్యక్తి నంది విగ్రహాన్ని కుక్క పాదాలతో తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోపై కఠిన చర్యలు తీసుకోవాలని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ వీడియో అవమానకరంగా ఉందని ఆలయ కమిటీ అధికారులు ఆగ్రహిస్తున్నారు. బద్రీనాథ్,కేదార్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో ఉన్న నాలుగు ధామ్‌లు అందరికీ స్ఫూర్తిదాయకమైన కేంద్రాలు. కానీ, ఈ విధంగా ఎలాంటి వాస్తవ సమాచారం లేకుండా సోషల్ మీడియాలో వీడియో, ఫోటో వైరల్ అయినప్పుడు అది మన మతపరమైన మనోభావాలను దెబ్బ తీస్తుందన్నారు. స్వయంగా కేదార్ ఆలయ కమిటీయే దీన్ని ట్వీట్ చేయడంతో మరింత వైరల్ అవుతోంది. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా చేశారంటూ అజేంద్ర అజయ్ వాపోయారు.. అదే సమయంలో ఆలయంలో భారీ సంఖ్యలో కమిటీ సిబ్బంది, పోలీసులు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడం విచారకరమంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, సదరు వ్యక్తిపై చట్టపరమైన, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ మే 17న బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ ఓ లేఖను విడుదల చేశారు.
आ गयी दूसरी रील, जूते पहनकर नंदी भगवान का स्पर्श ?♂️? https://t.co/MEwZFpPFnE pic.twitter.com/UHfPxgXxZM
— ABHISHEK SEMWAL (@Abhiisshhek) May 16, 2022