Vastu Tips: అప్పుల బాధలు వెంటాడుతున్నాయా..? వెంటనే ఇంట్లోని ఆ వాస్తు దోషాలను పరిష్కరించుకోండిలా..

|

Sep 16, 2023 | 9:41 AM

Vastu Tips: ఇంట్లోని వాస్తు దోషాలను నివారించకపోతే డబ్బు నిలకడ ఉండదని, అప్పుల బాధలు వెంటాడుతుంటాయని వాస్తు పండితులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో వెంటనే వాస్తు దోషాలను పరిష్కరించుకొని, తగు విధమైన నిమయాలను పాటించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీవితంలో డబ్బు నిలకడగా ఉండడంతో పాటు అప్పుల బాధలు తొలగిపోతాయంట. ఇంతకీ అప్పుల బాధల నుంచి..

Vastu Tips: అప్పుల బాధలు వెంటాడుతున్నాయా..? వెంటనే ఇంట్లోని ఆ వాస్తు దోషాలను పరిష్కరించుకోండిలా..
Vastu Tips For Money
Follow us on

Vastu Tips: హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రముఖ స్థానం ఉంది. నివాస స్థలంలో, పనిచేసే స్థలంలో వాస్తు దోషాలు ఉంటే నష్టాల పాలవుతారని అనాదిగా నమ్ముతూ వస్తున్నారు మన పూర్వీకులు. అలాగే ఈ వాస్తు దోషాలు వ్యక్తి జీవితం, పురోగతిపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని కూడా చెప్తుండేవారు. ఇంకా అనేక రకాలుగా ఆర్థిక, ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంట. ఇవే కాక అప్పుల బాధలను కూడా పడాల్సి ఉంటుంది. ఇంట్లోని వాస్తు దోషాలను నివారించకపోతే డబ్బు నిలకడ ఉండదని, అప్పుల బాధలు వెంటాడుతుంటాయని వాస్తు పండితులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో వెంటనే వాస్తు దోషాలను పరిష్కరించుకొని, తగు విధమైన నిమయాలను పాటించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీవితంలో డబ్బు నిలకడగా ఉండడంతో పాటు అప్పుల బాధలు తొలగిపోతాయంట. ఇంతకీ అప్పుల బాధల నుంచి బయట పడేందుకు ఏయే వాస్తు దోషాలను నివారించాలి..? ఎలా పరిష్కరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఇంటి వాస్తు అధ్వాన్నంగా ఉంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయి. వాస్తు ప్రకారం ఇంటి బాత్ రూమ్‌ని దక్షిణం, ఆగ్నేయం, నైరుతి దిశల్లో నిర్మిస్తే ఇంట్లోని సభ్యులకు అప్పుల బాధ తప్పదు. అందువల్ల పొరపాటున కూడా ఇంటి ఈ దిక్కుల్లో బాత్ రూమ్‌ నిర్మించుకోకూడదు. అలాగే వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ కూడా బాత్ రూమ్‌ ఉండకూడదు.బాత్ రూమ్‌లోని టాయిలెట్ సీటు ఎల్లప్పుడూ పశ్చిమం లేదా వాయువ్య దిశలో ఉండేలా నిర్మించుకోవాలి.
  2. రుణ సమస్యల నుండి బయట పొందడానికి, ఇంట్లో గాజు వస్తువులను అమర్చడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ గాజు వస్తువులను ఇంటి లేదా దుకాణం ఈశాన్య దిశలో అమర్చాలి. అయితే గాజు రంగు గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గాజు వస్తువులు ఎప్పుడూ ఎరుపు, వెర్మిలియన్ లేదా మెరూన్ రంగులో ఉండకూడదు.
  3. వాస్తు దోషాల పరిహారం వీలైనంత త్వరగా రుణం నుండి బయటపడటానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందుకోసం మీ డబ్బును ఇంటి లేదా దుకాణానికి ఉత్తర దిశలో భద్రపరుచుకోండి. ఇలా చేయడం వల్ల మీరు అప్పుల నుండి విముక్తి పొందడమే కాకుండా ఆర్థికంగా నిలకడ సాధిస్తారు.
  4. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆర్థిక సమస్యలను అధిగమించడానికి గృహానికి ప్రధాన ద్వారం దగ్గర మరొక చిన్న తలుపును అమర్చడం వల్ల ఇంటికి సంపద వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  5. వాస్తు శాస్త్రం ప్రకారం, రుణ వాయిదాలను ఎల్లప్పుడూ మంగళవారం మాత్రమే చెల్లించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల అప్పు త్వరగా తీరుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..