Vastu Tips: మంచి ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతకు ఈ వాస్తు చిట్కాలను పాటించి చూడండి..

|

Feb 17, 2022 | 8:24 PM

Vastu Tips: వాస్తు ఒక వ్యక్తి ఆరోగ్యం , సంపదపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో ఇంటి వాస్తు, ఫర్నిచర్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎవరైనా సరే ఆరోగ్యకరమైన..

Vastu Tips: మంచి ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతకు ఈ వాస్తు చిట్కాలను పాటించి చూడండి..
అంతే కాదు ఇది భార్యాభర్తల వైవాహిక జీవితాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కొత్త సంవత్సరం నాడు ఈ వస్తువులన్నింటిని ఇంట్లో నుండి బయటకు తీయడం ద్వారా, లక్ష్మి దేవి మీ ఇంటికి వస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి వెల్లువిరుస్తుంది.
Follow us on

Vastu Tips: వాస్తు ఒక వ్యక్తి ఆరోగ్యం , సంపదపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో ఇంటి వాస్తు, ఫర్నిచర్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎవరైనా సరే ఆరోగ్యకరమైన జీవితం, ప్రశాంతమైన ఇంటిని కోరుకుంటారు. కొన్ని వాస్తు చిట్కాలను ఫాలో అవడం ద్వారా, ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణంను  పొందవచ్చు. పనితో అలసిన మనిషి  విశ్రాంతిగా ఇంట్లోనే ఉండాలనుకుంటాడు.  అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా సరే  కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించవచ్చు . అవి అనారోగ్యం, మానసిక చికాకులను , నెగటివ్ ఎనర్జీని నివారించి మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పెంపొందించడానికి సహాయపడతాయి.

వాస్తు చిట్కాలు: 

*ఈశాన్య దిశలో రోజూ దీపం వెలిగించండి. ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

*ఇంటి పై కప్పునుంచి చినుకులు పడుతుంటే.. అవి ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి.  ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక ఇంటి పై కప్పునుంచి ఎటువంటి లీక్ లేకుండా చూసుకోండి.

*మెట్ల కింద ఉన్న స్థలాన్ని టాయిలెట్‌గా, స్టోర్‌ రూమ్ గా  లేదా వంటగదిగా ఉపయోగించడం వల్ల నాడీ జబ్బులు, గుండె జబ్బులు వస్తాయి.

*చదువుతున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు, ఉత్తరం లేదా తూర్పు వైపు ముఖం పెట్టండి. ఇది మంచి జ్ఞాపకశక్తి పెంపొందిస్తుంది.

*తులసి మొక్కలు ఉన్న ఇంట్లో పరిశుభ్రమైన గాలి వీస్తుంది. ఇంట్లో కాక్టస్ , ముళ్ళ మొక్కలను పెంచకూడదు. ఇవి ఇంట్లోని కుటుంబ సభ్యులకు అనారోగ్యం, ఒత్తిడి కలిగేలా చేస్తాయి.

*ఇంటికి ఈశాన్య మూలలో మెట్లు లేదా మరుగుదొడ్లు నిర్మించవద్దు. ఇలా చేయడం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.   పిల్లల అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది.

బెడ్ రూమ్ వాస్తు చిట్కాలు:

*నైరుతి దిశలో మాస్టర్ బెడ్‌రూమ్ శారీరక, మానసిక స్థిరత్వాన్నిఇస్తుంది. ఈశాన్య దిశలో బెడ్ రూమ్ ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

*పడుకునేటప్పుడు ఎప్పుడూ దక్షిణం వైపు తల పెట్టి పడుకోవాలి. ఇది ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఇస్తుంది.  ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వలన మానసిక ఒత్తిడి, శారీరక ఇబ్బందులు కలుగుతాయి.

*గర్భస్రావం జరగకుండా ఉండేందుకు గర్భిణీ స్త్రీ ఈశాన్య దిశలో పడుకోవడం మానుకోవాలి.

*మంచం దగ్గర అద్దం ఏర్పాటు చేసుకోవద్దు.. పీడకలలు ఏర్పడతాయి.

* బెడ్డ్ రూమ్ లో మంచాన్ని టాయిలెట్ గోడ తగిలేలా ఏర్పాటు చేసుకోకండి.. ఇలా చేయడం వలన  ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.

*మంచి నిద్ర పొందడానికి మంచంమీద మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్‌లను దూరంగా ఉంచండి.

వంట గది వాస్తు చిట్కాలు

*ఆగ్నేయ దిశ వంటగదికి మంచిదని భావిస్తారు.

*తూర్పు దిశ వంట , తినడానికి ఉత్తమ దిశగా పరిగణించబడుతుంది, తిన్న ఆహారం జీర్ణవడానికి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

*టాయిలెట్, వంటగదిని ఒకే చోట నిర్మించుకోవడం మంచిది కాదు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

 విడాకుల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య రజినీకాంత్‌.. ఏమన్నారంటే..

ఉన్నట్లుండి మౌన మునిలా మారిపోయిన మాణికం ఠాగూర్!.. గాంధీ భవన్‌లో హాట్‌ టాపిక్‌గా రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ వ్యవహారం..