
Dressing Table Vastu: వాస్తు శాస్త్రం అనేక ఇంటి సమస్యలకు పరిస్కారం చూపిస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తుందనే విషయాలను తెలియజేస్తుంది. ఇక ఇంట్లోని ప్రధాన గది పడక గది గురించి కూడా వాస్తు శాస్త్రం కీలక విషయాలను తెలిపింది. బెడ్ రూంలో డ్రెస్సింగ్ టేబుల్ వైవాహిక జీవిత ఆనందంపై నేరుగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ సరైన దిశలో ఉంచితే.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. కానీ, తప్పుడు దిశలో ఉంటే మాత్రం అనవసర సమస్యలు తలెత్తుతాయని, ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. మేకప్ వస్తువులను కూడా సరైన దిశలో ఉంచాలని చెబుతోంది. డ్రెస్సింగ్ టేబుల్ ఏ దిశలో, ఎక్కడ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ను తూర్పు, పడమర లేదా ఉత్తర దిశలో ఉంచడం ఉత్తమం. ప్రత్యామ్నాయంగా, డ్రెస్సింగ్ టేబుల్‌ను ఈశాన్య లేదా వాయువ్య దిశలలో కూడా ఉంచవచ్చు. ఈ దిశలలో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఉంచడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుందని, భార్యాభర్తల మధ్య ప్రేమ, సామరస్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు.
వాస్తు ప్రకారం.. దక్షిణ, నైరుతి లేదా ఆగ్నేయ దిశలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచకూడదు. ఈ దిశలలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచడం వల్ల ఇంట్లో అంతర్గత విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగ్నేయ దిశ అగ్ని సూత్రంతో ముడిపడి ఉన్నందున.. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్, అద్దం ఉంచడం నిప్పు మీద నీరు పోయడం లాంటిదిగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుందని చెబుతారు, ఇది ఇంట్లో ప్రమాదాలు లేదా అశాంతికి కారణమవుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలు, వాస్తు శాస్త్రంపై ఆధారపడి ఉంది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)