Vastu Tips: వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి, నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, ఆర్థిక పరమైన, కుటుంబ పరమైన సమస్యలు తొలగిపోవడానికి తులసి పూజ ఎంతో ఉపయుక్తం అని జ్యోతిష్య, వేద పండితులు చెబుతుంటారు. అయితే, తులసితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఆ ప్రయోజనాలు ఒనగూరాలంటే దానిని సరైన పద్ధతిలో నాటాలని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి మొక్కను ఏ దిశలో నాటాలి, ఏ దిశలో నాటకూడదు, ఏ సమయంలో పూజించాలి, ఏ సమయంలో నీటిని పోయాలి అనే విషయాలన్నీ తెలిసి ఉండాలంటున్నారు. అలా అయితే, ఇంట్లో మంచి జరుగుతుందంటున్నారు.
వాస్తు శాస్త్రం సహా, అనేక మతగ్రంధాల్లో తులసి మొక్కను లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. ఇలాంటి తులసి మొక్కను సరైన దిశలో నాటితో ఇంట్లో లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ ఉంటుందని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉత్తరం, ఈశాన్య, తూర్పు దిశలలో నాటాలి. ఈ దిశలలో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడింది. అయితే, తులసి మొక్కను ఎప్పుడూ దక్షిణ దిశలో నాటకూడదు. లేదంటే.. అనే దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రాల ప్రకారం.. తులసి మొక్క ఎక్కడ ఉంటే.. అక్కడ లక్ష్మీ దేవి అలరారుతుందని విశ్వాసం. అందుకే ప్రతీ ఇంట్లో వాస్తు ప్రకారం తులసి మొక్కను పెట్టుకుని పూజిస్తే మంచి జరుగుతుందని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు.
తులసి మొక్క.. అద్భుతమైన ఔషద గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల నెగటీవ్ ఎనర్జీ నశించి.. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల అనేక విపత్తులు దూరమవుతాయని విశ్వాసం. ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయట. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో తులసి ఉంటే.. మనసకు ప్రశాంతంగా, ఆనందం కలుగుతాయని విశ్వాసం.