మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు తప్పవు.. వెంటనే ఇలా చేయండి..

ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది వెదురు మొక్కలను తెచ్చి పెట్టుకుంటా. అయితే ఈ మొక్క కేవలం అందానికే కాదు.. అదృష్టానికి కూడా మారుపేరు. కానీ వాస్తు ప్రకారం దీనిని ఏ దిశలో పెట్టాలో తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు. సరైన చోట పెడితే సిరిసంపదలు.. పొరపాటున తప్పుడు దిశలో పెడితే కష్టాలు.. అసలు మీ ఇంట్లో వెదురు మొక్క ఎక్కడ ఉండాలి?

మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు తప్పవు.. వెంటనే ఇలా చేయండి..
Vastu Tips For Lucky Bamboo

Updated on: Mar 15, 2026 | 9:53 PM

నేటి కాలంలో ఇంటి అలంకరణలో ఇండోర్ ప్లాంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా లక్కీ బాంబూ లేదా వెదురు మొక్కను చాలా మంది అదృష్టానికి చిహ్నంగా భావించి ఇంట్లో పెంచుకుంటారు. అయితే ఈ మొక్క కేవలం అలంకరణకే కాదు.. వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచినప్పుడే సత్ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున తప్పుడు స్థానంలో పెడితే అది ఇంట్లో ప్రతికూల శక్తికి, మనశ్శాంతి కరువవ్వడానికి కారణమవుతుందట.

ఏ దిశలో ఉంచితే అదృష్టం?

వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను ఉంచడానికి కొన్ని ప్రత్యేక దిశలు ఉన్నాయి.

తూర్పు దిశ: ఈ దిశలో వెదురు మొక్కను ఉంచడం వల్ల కుటుంబంలో కొత్త ప్రారంభాలు బాగుంటాయి. ఇంట్లో శ్రేయస్సు, సభ్యుల మధ్య ప్రేమ పెంపొందుతాయి.

ఉత్తర దిశ: మీ కెరీర్‌లో పురోగతి సాధించాలన్నా, వ్యాపారంలో వృద్ధి చెందాలన్నా ఉత్తర దిశలో ఈ మొక్కను ఉంచడం ఉత్తమం.

ఆగ్నేయ దిశ : ఆర్థిక ఇబ్బందులు తొలగి, ధన లాభం కలగాలంటే ఆగ్నేయ దిశలో వెదురు మొక్కను ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

లివింగ్ రూమ్‌లో ఉంచితే కలిగే ప్రయోజనాలు:

వెదురు మొక్కను ఇంటి హాలులో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది. ఇది ప్రశాంతమైన, సమతుల్య వాతావరణాన్ని సృష్టిస్తుంది. మానసిక ప్రశాంతతకు ఇది ఎంతో దోహదపడుతుంది.

ఎక్కడ పెట్టకూడదు?

మొక్క అందంగా ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం సరికాదు.

బాత్రూమ్‌లు, టాయిలెట్‌లు: వీటి దగ్గర వెదురును ఎప్పుడూ ఉంచవద్దు. ఇది ప్రతికూలతను పెంచుతుంది.

వంటగది: వంటగదిలో కూడా ఈ మొక్కలను నివారించడం మంచిది.

మురికి ప్రదేశాలు: వెదురు మొక్కను ఎప్పుడూ శుభ్రమైన చోటే ఉంచాలి. దుమ్ము, మురికి ఉన్న చోట పెడితే రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జాగ్రత్తలు

వెదురు మొక్క వేర్లను ఎర్రటి దారం లేదా రిబ్బన్‌తో కట్టడం వల్ల దాని అదృష్టం మరింత పెరుగుతుందని నమ్ముతారు.
కుండీలోని నీటిని క్రమం తప్పకుండా మారుస్తూ, మొక్క ఎప్పుడూ తాజాగా ఉండేలా చూసుకోవాలి.

గుర్తుంచుకోండి.. మొక్క ఆరోగ్యంగా ఉంటేనే మీ ఇంటి వాస్తు కూడా బాగుంటుంది!

Follow Us