Vastu Tips: ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా.. ఈ దిశ కూర్చుని తింటే అనారోగ్యం బారిన పడతారు..

|

Sep 06, 2024 | 5:01 PM

ఏమి తింటారు, మీరు ఎలా కూర్చుని తింటారు, ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వాస్తు శాస్త్రమే కాదు.. జ్యోతిష్య శాస్త్రం కూడా ఈ విషయంలో సరైన మార్గాన్ని సూచించింది. ఆహారం తినడానికి సమయం గురించి ప్రస్తావిస్తున్నాయి. అలాగే భోజనం చేసేటప్పుడు ఏమి చేయకూడదో కూడా అందులో ప్రస్తావించబడింది. వాటిని పాటిస్తే జీవితంలో వచ్చే ఎన్నో సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

Vastu Tips: ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా.. ఈ దిశ కూర్చుని తింటే అనారోగ్యం బారిన పడతారు..
Vastu Tips
Follow us on

హిందూ మతంలో జీవావరణ శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు దోషం ఉంటే దాని ప్రభావం జీవితంపై కూడా పడుతుంది. అందుకనే ఇంటి నిర్మాణంలో కానీ అలంకరణ లో కానీ వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇలా చేయడం వలన ఇంట్లో నివసించే వారు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. అయితే వాస్తుని ఎంత ఫాలో అయినా నిత్య జీవితంలో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం.. ఆ పొరపాట్ల ఖరీదు తర్వాత తెలుస్తుంది. అలాంటి పొరపాట్లలో తినడం.. తిన్న తర్వాత గిన్నెలు కూడా ఉన్నాయి. ఏమి తింటారు, మీరు ఎలా కూర్చుని తింటారు, ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వాస్తు శాస్త్రమే కాదు.. జ్యోతిష్య శాస్త్రం కూడా ఈ విషయంలో సరైన మార్గాన్ని సూచించింది. ఆహారం తినడానికి సమయం గురించి ప్రస్తావిస్తున్నాయి. అలాగే భోజనం చేసేటప్పుడు ఏమి చేయకూడదో కూడా అందులో ప్రస్తావించబడింది. వాటిని పాటిస్తే జీవితంలో వచ్చే ఎన్నో సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

  1. డిన్నర్ లేదా లంచ్ కోసం కూర్చున్నప్పుడు.. ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోండి. దక్షిణ ముఖంగా భోజనం చేయకూడదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
  2. ప్రస్తుతం ఎక్కువ మంది ఇళ్లలో కుర్చీలు, బల్లలపైనే భోజనం చేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ టేబుల్‌ను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. పండ్లు, స్వీట్లు లేదా మరేదైనా ఆహారాన్ని ఎల్లప్పుడూ ఇక్కడ ఉంచాలి. ఇంట్లో తిండికి లోటు లేదు.
  3. టీవీ చూస్తూనో సెల్ ఫోన్ చూస్తూనో మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. వాస్తుశాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చొని తినడం వలన జీవితంలో ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దీర్ఘకాలిక అనారోగ్యంతో కూడా బాధపడవచ్చు.
  4. చాలా మంది ఆహారంతో పాటు ఉప్పుని కూడా తినే ప్లేట్ లో వేసుకుని కూర్చుంటారు. అయితే కంచంలో మిగలిన ఉప్పును ఎప్పుడూ విసిరేయకండి. అవసరమైతే ఆ కంచంలో కొద్దిగా నీరు పోసి ఉప్పు కరిగేలా చేయాలి. లేకుంటే ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంట్లో అలజడి మొదలవుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తిన్న తర్వాత వంట గిన్నెలను అలా విడిచి పెట్టకండి. చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత వంట గిన్నెలను మర్నాడు కడుగుదాం అని వదిలివేస్తారు. ఈ తప్పు చేయడం వల్ల అన్నపూర్ణా దేవితో పాటు లక్ష్మీ దేవి కి ఆగ్రహం కలుగుతుంది. దీంతో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి