
Vastu Tips For Fish Aquarium
వాస్తు శాస్త్రంలో ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా, ప్రశాంతంగా, సంపన్నంగా ఉంచడానికి కొన్ని ప్రత్యేక చర్యలు సూచించబడ్డాయి. వాటిలో ఒకటి ఇంట్లో చేపల అక్వేరియం ఉండటం. ఇది శుభం, సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అక్వేరియం సరైన దిశలో, నియమాల ప్రకారం ఉంచినట్లయితే ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు , అదృష్టాన్ని పెంచుతుంది. కనుక ఈ రోజు చేపల అక్వేరియంని ఏ దిశలో పెట్టుకోవడం వలన ఎలాంటి ఫతలితాలు వస్తాయో తెలుసుకుందాం..
ఫిష్ అక్వేరియం ప్రాముఖ్యత ఏమిటంటే
- ప్రతికూల శక్తి తగ్గింపు: చేపల అక్వేరియంలో నీటి మూలకం ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంటి నుంచి ప్రతికూల శక్తిని బయటకు వెళ్ళేలా చేస్తుంది.
- సంపద, శ్రేయస్సు పెరుగుదల: నీటి కదలిక , చేపల సందడి ఇంట్లో లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడతాయి. కనుక ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉండడం వలన ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది.
- శుభ సంకేతం: చేపల కదలిక ఇంట్లో చురుకుదనం , పెరుగుదలను సూచిస్తుంది. అదే సమయంలో ఒకవేళ చేప చనిపోతే అది ఇంట్లోని ఏర్పడిన పెద్ద ఇబ్బందిని అదే తీసుకుందని నమ్ముతారు.
- ప్రశాంతత: ఫిష్ అక్వేరియం ఉన్న చోట మనసుకు శాంతి లభిస్తుంది. మనసుకి ఏకాగ్రతను అందిస్తుంది, తద్వారా కుటుంబంలో మానసిక సమతుల్యతను కాపాడుతుంది.
చేపల ఆక్వేరియంను ఏ దిశలో ఉంచాలంటే
- ఈశాన్య కోణం: ఇది అత్యంత శుభప్రదమైన దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశలో ఆక్వేరియం ఉంచడం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, సంపద లభిస్తాయి.
ఉత్తర దిశ: ఇది నీటి మూలకం దిశ,.ఇక్కడ అక్వేరియం ఉంచడం వల్ల కెరీర్ , వ్యాపారంలో విజయం లభిస్తుంది.
చేపల అక్వేరియం ఏ దిశల్లో ఉంచకూడదు?
- దక్షిణ దిశ: ఇది అగ్ని మూలక దిశ. నీటి మూలకమైన చేపల తొట్టిని ఇక్కడ ఉంచడం వల్ల ఇంట్లో ఉద్రిక్తత, కుటుంబ సభ్యుల మధ్య వివాదం, ఆర్థిక నష్టం సంభవించవచ్చు.
- నైరుతి దిశ: ఈ దిశలో అక్వేరియం ఉంచడం వల్ల ఇంటి సమతుల్యత దెబ్బతింటుంది. స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- దానిని బెడ్ రూమ్, వంటగదిలో ఉంచవద్దు: చేపల అక్వేరియం నీటి మూలకం కనుక ఈ ప్రదేశాల్లో పెట్టడం వలన వైవాహిక జీవితంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
- చేపల సంఖ్య: చేపల సంఖ్యను ఎల్లప్పుడూ బేసిగా ఉంచండి. అంటే 7, 9 లేదా 11 లాగా. ముఖ్యంగా 8 బంగారు చేపలు, 1 నల్ల చేప శుభప్రదంగా భావిస్తారు. నల్ల చేప ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది.
- నీటిని శుభ్రంగా ఉంచండి: అక్వేరియంలోని నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి నీరు ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తుంది.
- చేపలను జాగ్రత్తగా చూసుకోండి : జబ్బుపడిన లేదా చనిపోయిన చేపలను వెంటనే తొలగించి కొత్త వాటిని కొత్తవాటితో రీప్లేస్ చేయండి.
- ప్రతిరోజూ వీక్షించండి: అక్వేరియంను క్రమం తప్పకుండా వీక్షించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మానసిక ప్రశాంతతను తెస్తుంది.
- లైటింగ్ నిర్వహించండి: అక్వేరియంలో లేత నీలం రంగు కాంతిని శుభప్రదంగా భావిస్తారు. ఇది నీటి మూలకాన్ని చురుకుగా ఉంచుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.