Vastu Tips: అప్పు ముప్పే.. పొరపాటున కూడా ఈ ఐదు వస్తువులను తీసుకోవద్దు.. లేదంటే పేదరికం మీ సొంతం

|

Feb 08, 2023 | 11:59 AM

వాస్తు శాస్త్రం  ప్రకారం, ఎవరైనా వ్యక్తులు ఒకరికొకరు తమ వస్తు మార్పిడి చేసుకున్నప్పుడు.. ఒకరి శక్తులు ఒకరిలో ప్రవేశిస్తాయి. ఇలాంటి ప్రతికూల శక్తి కారణంగా.. ఒక వ్యక్తి అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Vastu Tips: అప్పు ముప్పే.. పొరపాటున కూడా ఈ ఐదు వస్తువులను తీసుకోవద్దు.. లేదంటే పేదరికం మీ సొంతం
Vastu Tips In Telugu
Follow us on

వాస్తు శాస్త్రంలో.. దిశల ప్రాముఖ్యతను మాత్రమే కాదు.. ఒక వ్యక్తి రోజువారీ జీవితానికి సంబంధించిన నియమాలను కూడా పేర్కొన్నాయి. మన సమాజంలో చాలా మందికి ఇతరుల నుండి వస్తువులను అడిగి వాటిని ఉపయోగించుకుంటారు. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం.. కొన్ని రకాల ఇతరుల నుంచి వస్తువులను ఈ విధంగా తీసుకోవడం..  ఇవ్వడం శ్రేయస్కరం కాదు. ఇతరుల వస్తువులను అడిగేవారికి.. ఆ వస్తువుల నుంచి .. అవతలివారిలో ఉన్న ప్రతికూల శక్తి .. అప్పు తీసుకున్నవారిలో ప్రవేశిస్తుంది. ఒక వ్యక్తి లోపల ప్రతికూల శక్తి ప్రవేశించడం వల్ల.. అప్పుడు అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తు శాస్త్రం  ప్రకారం, ఎవరైనా వ్యక్తులు ఒకరికొకరు తమ వస్తు మార్పిడి చేసుకున్నప్పుడు.. ఒకరి శక్తులు ఒకరిలో ప్రవేశిస్తాయి. ఇలాంటి ప్రతికూల శక్తి కారణంగా.. ఒక వ్యక్తి అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వస్తువులను ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులనుంచి అప్పుగా తీసుకోవద్దు.. అవి ఏమిటో తెలుసుకుందాం..

  1. ఇతరుల నుంచి నగలను తీసుకోవడం:
    ముఖ్యంగా మహిళలు పార్టీకి, పూజలకు, శుభకార్యాలు, పెళ్లిళ్లు వంటి  కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఇతరుల నుంచి మంచి బట్టలను, మ్యాచింగ్ నగలను  అడిగి తీసుకుని వాటిని ధరించడం తరచుగా కనిపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇలా ఇతరుల ఆభరణాలను అడిగి.. వాటిని ధరించడం నిషేధించబడింది. ఇలా చేయడం గ్రహాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. దీని కారణంగా ఇలా ఇతరుల వస్తువులను ధరించిన వ్యక్తి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అప్పుడు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది.
  2. పెన్నులు, పుస్తకాలు:
    జ్ఞానం పుస్తకాలు, కలం నుండి లభిస్తుంది.  వాస్తు శాస్త్రం ప్రకారం, పుస్తకాన్ని అప్పుగా తీసుకుని చదవకూడదు.అదే విధంగా పుస్తకాన్ని  అప్పు ఇవ్వకూడదు. పుస్తకాలు ఇవ్వడం వల్ల జ్ఞాన సాధనలో ఆటంకాలు ఏర్పడతాయి.
  3. పాదరక్షలు 
    వాస్తు శాస్త్రంలో పాదరక్షలను ఇచ్చి పుచ్చుకోవడం శుభప్రదంగా పరిగణించబడదు. వేరొకరి షూ లేదా చెప్పులు అప్పుగా తీసుకుని ఎప్పుడూ ధరించవద్దు. అప్పులు చేసి చెప్పులు వేసుకునే వారి జీవితాల్లో పేదరికం వస్తుంది. ఇలా చేయడం వల్ల ఇతరుల ప్రతికూల శక్తులు దూరమై.. అవి ధరించిన వారికి లభిస్తాయి.
  4. దువ్వెన
    చాలా మంది ఇతరులు ఉపయోగించే దువ్వెనను ఉపయోగిస్తారు. ఈ అలవాటు ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా అదృష్టంతో సంబంధం కలిగి ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఉప్పు
    వాస్తు శాస్త్రం ప్రకారం. సూర్యాస్తమయం తర్వాత ఉప్పు ఎవరి దగ్గరా అప్పుగా తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు. వాస్తు శాస్త్రంలో ఉప్పును అప్పుగా ఇస్తే ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం దూరమవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)