గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కూరలకు ఉపయోగించేది. మరొకటి దిష్టి కోసం వాడే బూడిద గుమ్మడికాయ. దీనిని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. గుమ్మడికాయను కడగకూడదు. దానిపై పేరుకున్న బూడిదను శుభ్రం చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. కేవలం పసుపు, కుంకుమ బొట్లు పెడితే సరిపోతుంది.
గుమ్మడికాయను తొడిమతో పట్టుకోవాలి. తొడిమ ఊడిపోతే దాని శక్తి పోతుంది. తొడిమ లేకుండా కడితే ఫలితం ఉండదు. మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు గుమ్మడికాయను తిరగేసి పట్టుకోకూడదు. అంటే కాడ కిందికి, కాయ పైకి ఉండేలా పట్టుకోకూడదు. కాడ పైకి ఉండేలా పట్టుకుంటేనే దాని శక్తి నిలుస్తుంది.
గుమ్మడికాయను కట్టడం చాలా సులభం. గుమ్మడికాయను ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. దానిని జాలిలో పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. ఈ నియమాలను పాటించి సరైన సమయంలో గుమ్మడికాయను కట్టడం వల్ల దిష్టి ప్రభావం నుంచి బయటపడవచ్చు.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)